Mumbai: కర్కరే బలైంది పోలీసు తూటాకు.. మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ ఆరోపణ!
ABN, Publish Date - May 06 , 2024 | 04:09 AM
26/11ముంబై ఉగ్రదాడుల్లో పోలీసు అధికారి హేమంత్ కర్కరే ఉగ్రవాది కసబ్ బుల్లెట్లకు బలి కాలేదని, ఆరెస్సె్‌సకు అనుకూలంగా ఉండే ఓ పోలీసు అధికారి తూటాలు తగిలి మరణించారని కాంగ్రెస్ నేత విజయ్ నామ్‌దేవ్‌రావ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ముంబయి, మే 5: 26/11ముంబై ఉగ్రదాడుల్లో పోలీసు అధికారి హేమంత్ కర్కరే ఉగ్రవాది కసబ్ బుల్లెట్లకు బలి కాలేదని, ఆరెస్సె్‌సకు అనుకూలంగా ఉండే ఓ పోలీసు అధికారి తూటాలు తగిలి మరణించారని కాంగ్రెస్ నేత విజయ్ నామ్‌దేవ్‌రావ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడికి పాల్పడిన కసబ్‌ను ఉరి కంబానికి ఎక్కించడంలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించిన ఉజ్వల్ నికమ్ కీలక పాత్ర పోషించారు. నికమ్ ప్రస్తుతం ఉత్తర మధ్య ముంబై నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండడంతో కాంగ్రెస్ నేత వడెట్టివార్ పాత విషయాలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. ‘‘నికమ్ దేశ ద్రోహి. కర్కరేకు తగిలింది పోలీసు అఽధికారి బుల్లెట్టు అన్న విషయాన్ని కోర్టులో చెప్పొద్దా? కోర్టులో వాస్తవాలు దాచిపెట్టిన దేశద్రోహికి బీజేపీ టిక్కెట్ ఇచ్చింది’’ అని విమర్శించారు.
Updated Date - May 06 , 2024 | 04:09 AM