Share News

Karnataka: సీఎంకు వ్యతిరేకంగా పాదయాత్ర.. అనుమతి ఇవ్వని సర్కారు

ABN , Publish Date - Jul 30 , 2024 | 09:33 AM

ముడా (మైసూర్ నగరాభివృద్ధి సంస్థ) కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్యపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ బీజేపీ, జేడీఎస్ డిమాండ్ చేస్తున్నాయి. అందుకోసం ఆగస్ట్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు.. అంటే వారం రోజుల పాటు పాదయాత్ర చేయాలని ఈ రెండు పార్టీలు.. నిర్ణయించాయి.

Karnataka: సీఎంకు వ్యతిరేకంగా పాదయాత్ర.. అనుమతి ఇవ్వని సర్కారు
Karnataka Home Minister G Parameshwara.

బెంగళూరు, జులై 30: ముడా (మైసూర్ నగరాభివృద్ధి సంస్థ) కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్యపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ బీజేపీ, జేడీఎస్ డిమాండ్ చేస్తున్నాయి. అందుకోసం ఆగస్ట్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు.. అంటే వారం రోజుల పాటు పాదయాత్ర చేయాలని ఈ రెండు పార్టీలు.. నిర్ణయించాయి.

Also Read: Jharkhand: పట్టాలు తప్పిన ముంబయి- హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు


అనుమతి లేదు..

ఈ పాదయాత్రకు అనుమతి లేదని కర్ణాటక హోం శాఖ మంత్రి పరమేశ్వరన్ స్పష్టం చేశారు. ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని కుండ బద్దలు కొట్టారు. ఓ వేళ పాదయాత్ర చేసుకుంటే చేసుకోవచ్చని.. వారిని ఎవరు ఆపరని హోం శాఖ మంత్రి పేర్కొన్నారు. పోలీస్ శాఖ సైతం వారికి అనుమతి ఇవ్వదన్నారు.

Also Read: President Murmu: ఆగస్టు 5 నుంచి రాష్ట్రపతి విదేశీ పర్యటన


ఆ విషయం డీకే చూసుకుంటారు..

అయితే విపక్షంలోని భాగస్వామ్య పక్షాలు చేస్తున్న ఈ పాదయాత్రకు కౌంటర్‌గా అధికార కాంగ్రెస్ పార్టీ ఏమైనా పాదయాత్ర తరహాలో నిరసన తెలియజేస్తుందా? అని విలేకర్లు హోం మంత్రిని ప్రశ్నించారు. ఆ వ్యవహారాన్ని రాష్ట్ర పార్టీ అధినేత డి.కె. శివకుమార్ చూసుకుంటారని సమాధానమిచ్చారు. ఓ ప్రశ్నకు సమాధానంగా వాళ్లు రాజకీయం చేస్తున్నారంటూ బీజేపీ, జేడీఎస్‌పై ఆయన మండిపడ్డారు. తాము మాత్రం ప్రభుత్వ పరంగా వెళ్తామని స్పష్టం చేశారు. రిసిడెన్షియల్ లే అవుట్‌లో సీఎం సిద్దరామయ్య భార్య పార్వతీకి భారీగా ప్లాట్లను ముడా కేటాయించందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.


స్పందించిన సీఎం సిద్దు..

అయితే దీనిపై సీఎం సిద్దరామయ్య సైతం స్పందించారు. ఈ ప్లాట్లు..తమకు 2021లో ముడా కేటాయించిందని స్పష్టం చేశారు. ఆ సమయంలో కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉందని ఆయన గుర్తుచేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆగస్ట్ 3వ తేదీ నుంచి ఆగస్ట్ 10వ తేదీ వరకు 140 కిలోమీటర్లు మేర పాదయాత్ర చేయాలని బీజేపీ, జేడీ(ఎస్) నేతలు ఇటీవల బెంగళూరులో సమావేశమై నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర బెంగళూరులో ప్రారంభమై.. మైసూర్‌లో ముగియనుంది.


కేంద్ర మంత్రి అనారోగ్యం పాలైన వేళ..

ఈ పాదయాత్రపై నిర్ణయం కోసం జరుగుతున్న సమావేశంలోనే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డి కుమారస్వామి ముక్కు నుంచి రక్తం కారింది. దీంతో ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించిన విషయం విధితమే.

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 30 , 2024 | 10:41 AM