Karnataka High Court : రిటైర్మెంట్ తర్వాత పుట్టినతేదీ మార్పు కుదరదు
ABN, Publish Date - Aug 13 , 2024 | 05:45 AM
రిటైర్మెంట్ తర్వాత పుట్టిన తేదీ మార్పు సాధ్యం కాదని కర్ణాటక హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎంజీఎస్ కమల్ ఏకసభ్య ధర్మాసనం సోమవారం తీర్పునిచ్చింది.
కర్ణాటక హైకోర్టు
బెంగళూరు, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): రిటైర్మెంట్ తర్వాత పుట్టిన తేదీ మార్పు సాధ్యం కాదని కర్ణాటక హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎంజీఎస్ కమల్ ఏకసభ్య ధర్మాసనం సోమవారం తీర్పునిచ్చింది.
1983 అక్టోబరులో పల్ప్ డ్రాయింగ్ ప్రాసెసర్‌గా ఉద్యోగంలో చేరిన వ్యక్తి 2006 మార్చి 9న రిటైరయ్యారు. సదరు వ్యక్తి తన పుట్టిన తేదీని మౌఖికంగా నమోదు చేశారని, అందుకు సంబంధించి ఎటువంటి రికార్డులు లేవని కోర్టును ఆశ్రయించారు.
చివరకు ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్), స్కూల్ రికార్డుల ప్రకారం 2006కు ఆయనకు 58 ఏళ్లు కావడంతో రిటైరయ్యారు. ఆ తరువాత 1952లో తాను జన్మించినట్టు డిప్యూటీ తహసీల్దార్‌తో ప్రమాణపత్రాన్ని పొంది, 2010వరకు ఉద్యోగం చేయాల్సి ఉందని హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ధర్మాసనం, ఉద్యోగంలో చేరిన సమయంలోనే పుట్టిన తేదీని నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.
విధి నిర్వహణలో ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తలేదని, రిటైర్మెంట్ సమయంలోనూ ప్రస్తావించలేదని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందిన రెండేళ్ల తర్వాత అభ్యంతరం వ్యక్తం చేయడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది.
Updated Date - Aug 13 , 2024 | 05:45 AM