ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Arvind Kejriwal arrest: కేజ్రీవాల్ అరెస్ట్.. ఇండియా కూటమిపై ప్రభావం చూపిస్తుందా..?

ABN, Publish Date - Mar 22 , 2024 | 12:05 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేజ్రీవాల్ (Kejriwal) అరెస్ట్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమర్థిస్తుండగా.. ప్రతిపక్షాలు రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. మొదటి దశ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వేళ కేజ్రీవాల్ అరెస్ట్ ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై ఏ విధంగా ఉంటుందనే చర్చ నడుస్తోంది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేజ్రీవాల్ (Kejriwal) అరెస్ట్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమర్థిస్తుండగా.. ప్రతిపక్షాలు రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. మొదటి దశ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వేళ కేజ్రీవాల్ అరెస్ట్ ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై ఏ విధంగా ఉంటుందనే చర్చ నడుస్తోంది.

లిక్కర్ కేసులో విచారణకు రావాలంటూ ఈడీ 9సార్లు కేజ్రీవాల్‌కు నోటీసులు పంపింది. విచారణకు వెళ్తే అరెస్ట్ చేస్తారనే అనుమానంతో ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కేజ్రీవాల్‌కు ఉపశమనం లభించలేదు. దీంతో ఈడీ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయవచ్చనే అంచనాల నేపథ్యంలో గురువారం ఆయనను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ అంశం ప్రస్తుతం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉండటంతో కేజ్రీవాల్‌కు కాంగ్రెస్‌తో పాటు కూటమిలో పార్టీలు మద్దతు పలుకుతున్నాయి.

Arvind Kejriwal arrest: జైల్లో కీలకనేతలు.. ఆప్‌ను నడిపించేదెవరు?

లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం..

అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ఆప్‌తో పాటు విపక్ష కూటమికి రాజకీయంగా పెద్ద దెబ్బగానే చెప్పుకోవాలి. అవినీతి ఆరోపణల కింద ఇప్పటికే ఆప్‌కు చెందిన మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేందర్ జైన్, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ జైలులో ఉన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేశారు. ఈ అరెస్ట్ ఆప్ లోక్‌సభ ప్రచారాన్ని ప్రభావితం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆప్‌కు కేజ్రీవాల్ ముఖ్య నాయకుడిగా ఉన్నారు. ఆయన ద్వారా ఆప్ దేశంలో వ్యాప్తి చెందగలుగుతుంది. ఢిల్లీ, పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వాలున్నాయి. ఈ పరిస్ధితుల్లో కేజ్రీవాల్ అరెస్ట్‌తో రాజకీయంగా ఆ పార్టీ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. తన ప్రసంగాలతో ఓటర్లను కేజ్రీవాల్ ప్రభావితం చేయగల వ్యక్తి. ఈ దశలో కూటమిలోని ప్రధాన నాయకుడు అరెస్ట్ కావడం ఇండియా కూటమికి కోలుకోలుని దెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇండియా కూటమి మద్దతు

అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆయనకు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. పలు చోట్ల ర్యాలీలు చేయగా.. ప్రతిపక్ష కూటమిలోని పార్టీలు ఈ ప్రదర్శనల్లో పాల్గొన్నాయి. మరోవైపు ఇండియా కూటమిలోని ముఖ్య నేతలు ఈరోజు సమావేశం కానున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఎలా స్పందించాలి. ఏ విధమైన పోరాటం చేయాలనే అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేజ్రీవాల్ కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. ఈరోజు రాహుల్ గాంధీ కేజ్రీవాల్ కుటుంబ సభ్యులను నేరుగా కలిసి ధైర్యం చెప్పనున్నారు.

ఎవరికి లాభం?

ఇండియా కూటమిలో కాంగ్రెస్ ప్రధాన భాగస్వామిగా ఉంది. కూటమిలో ఉండటంతో కేజ్రీవాల్‌కు హస్తం పార్టీ అండగా నిలవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయ్యారు. ఈ కేసు విషయంలో కాంగ్రెస్ వైఖరి ఆ పార్టీకి నష్టం చేసే అవకాశం ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌కు కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తోంది. ఇదే కేసులో అరెస్టైన బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌ను మాత్రం సమర్థిస్తోంది. ఒక కేసు విషయంలో హస్తం పార్టీ ద్వంద వైఖరి అవలంభించడం కూటమికి నష్టం చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు అరెస్ట్ సానుభూతి ఆప్‌తో పాటు విపక్ష కూటమికి ప్లస్ అవుతుందనే వాదన ఉంది. కేజ్రీవాల్ అరెస్ట్ ఎన్నికల్లో ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం అనేది తేలాలంటే జూన్4 వరకు ఆగాల్సిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 22 , 2024 | 12:05 PM

Advertising
Advertising