ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi : కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో నిరాశ

ABN, Publish Date - Jun 25 , 2024 | 03:19 AM

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైలులో ఉన్న సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురయింది. ఆయన బెయిల్‌పై ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించలేదు.

న్యూఢిల్లీ, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైలులో ఉన్న సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురయింది. ఆయన బెయిల్‌పై ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించలేదు. ఈ కేసులో ట్రయల్‌ కోర్టు తనకు ఇచ్చిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టే విధించడాన్ని సవాల్‌ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా, జస్టిస్‌ ఎస్వీఎన్‌ భట్టిలతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ విచారణ చేపట్టింది. హైకోర్టు స్టే విధించిన తీరు అసాధారణంగా ఉందని అయితే, ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు తీర్పు కోసం మరో రోజు వేచి చూద్దామని తెలిపింది. విచారణను బుధవారానికి వాయిదా వేసింది. మరోవైపు కేజ్రీవాల్‌కు బెయిల్‌ ఇవ్వకుండా స్టే ఇవ్వాలంటూ ఈడీ చేసిన వినతిపై మంగళవారం హైకోర్టు నిర్ణయాన్ని వెలువరించనుంది.

Updated Date - Jun 25 , 2024 | 03:21 AM

Advertising
Advertising