Washington: భారత్ మాకు వ్యూహాత్మక భాగస్వామే!
ABN, Publish Date - Jul 11 , 2024 | 05:18 AM
భారత్-రష్యా భాగస్వామ్య ఒప్పందాలు, ఇరు దేశాల మధ్య స్నేహం వంటి కీలక విషయాలపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. రష్యాతో భారత్ బంధంపై తాము ఆందోళన చెందుతున్నామని చెబుతూనే.. భారత్‌ను తాము వ్యూహాత్మక భాగస్వామ్య దేశంగానే పరిగణిస్తున్నట్టు తెలిపింది.
రష్యాతో బంధం ఆందోళనకరం
అమెరికా అధ్యక్ష భవనం
వాషింగ్టన్, జూలై 10: భారత్-రష్యా భాగస్వామ్య ఒప్పందాలు, ఇరు దేశాల మధ్య స్నేహం వంటి కీలక విషయాలపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. రష్యాతో భారత్ బంధంపై తాము ఆందోళన చెందుతున్నామని చెబుతూనే.. భారత్‌ను తాము వ్యూహాత్మక భాగస్వామ్య దేశంగానే పరిగణిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు అమెరికా అధ్యక్ష భవనం అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ రెండు రోజుల పాటు రష్యాలో పర్యటించిన విషయం తెలిసిందే. 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలు ఒప్పందాలు చేసుకున్నారు. ద్వైపాక్షిక అంశాలపైనా సమగ్రంగా చర్చించారు. ఇదే సమయంలో ఉక్రెయిన్-రష్యా యుద్ధంపైనా మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్ష భవనం అధికార ప్రతినిధి, మీడియా కార్యదర్శి మేజర్ జనరల్ పాట్ రైడెర్ మాట్లాడుతూ..రష్యాతో భారత్ సంబంధాలు కొనసాగించినా.. భారత్ విషయంలో తమ వైఖరి మారబోదన్నారు. అయితే, మోదీతో భేటీని పుతిన్ తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉందన్నారు.
Updated Date - Jul 11 , 2024 | 05:18 AM