Lalu Prasad Yadav: 'ఎన్నికలకు సిద్ధంకండి.. త్వరలో మోదీ సర్కార్ కూలుతుంది'
ABN, Publish Date - Jul 05 , 2024 | 04:54 PM
మోదీ ప్రభుత్వంపై ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం ఆగస్ట్‌లో కుప్పకూలిపోనుందని ఆయన జోస్యం చెప్పారు. దీంతో ఎన్నికలు ఏ సమయంలోనైనా మళ్లీ జరగవచ్చునన్నారు.
పట్నా, జులై 05: మోదీ ప్రభుత్వంపై ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం ఆగస్ట్‌లో కుప్పకూలిపోనుందని ఆయన జోస్యం చెప్పారు. దీంతో ఎన్నికలు ఏ సమయంలోనైనా మళ్లీ జరగవచ్చునన్నారు. ఆ ఎన్నికలకు మీరంతా సిద్దంగా ఉండాలంటూ అన్నీ రాజకీయ పార్టీ శ్రేణులకు ఈ సందర్బంగా లాలూ ప్రసాద్ యాదవ్ పిలుపు నిచ్చారు. శుక్రవారం పట్నాలో మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా వేడిని పుట్టించాయి.
Also Read: LokSabha: ఎంపీలుగా ప్రమాణం చేసిన.. రషీద్, అమృత్ పాల్
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కేవలం 240 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీయే భాగస్వామ్య పక్ష పార్టీలు టీడీపీ, జేడీ(యూ), జేడీ(ఎస్), ఎల్‌జేపీ(పాశ్వాన్) తదితర పార్టీలు సహాయం అనివార్యమైంది. అయితే బిహార్‌కు ప్రత్యేక హోదాతోపాటు పలు కీలక అంశాలపై ఆ రాష్ట్రంలోని జేడీ(యూ) అధినేత, సీఎం నితీశ్ కుమార్.. మోదీ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకు వస్తున్నారు. అలాంటి వేళ మోదీ ప్రభుత్వంపై అదే రాష్ట్రానికి చెందిన మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్.. ఈ తరహా వ్యాఖ్యలు చేయడం తీవ్ర ప్రాధాన్యత సంతరించుకొన్నాయి.
Also Read: Amit Shah: ఆ తర్వాతే.. అసెంబ్లీ ఎన్నికలు..!
మరోవైపు ఇదే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమిలోని అన్ని భాగస్వామ్య పార్టీలు కలిపి 233 స్థానాలను కైవసం చేసుకున్నాయి. దీంతో ఎన్డీయే కూటమిలోని పార్టీలు ఏమైనా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకొంటే మాత్రం లాలూ వ్యాఖ్యలను బలం చేకూరే అవకాశముందనే ఓ ప్రచారం సాగుతుంది. అదీకాక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలను గెలిచుకుంది. ఇంకోవైపు మహారాష్ట్రలోని సాంగ్లీ నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో నిలిచి విశాల్ పాటిల్ ఘన విజయం సాధించారు.
Also Read: Viral Video: రీల్స్ కోసం.. ‘పిల్ల చేష్టలు’
అనంతరం అతడు హస్తం పార్టీలో చేరారు. దీంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 100కి చేరింది. అయితే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఈ ఎన్నికల్లో అటు రాయబరేలీ, ఇటు వయనాడ్ నుంచి గెలుపొందారు. ఈ రెండు స్థానాల్లో ఒక దానికి రాజీనామా చేయాల్సి రావడంతో.. ఆయన వయనాడ్‌కు రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య మళ్లీ 99కి చేరింది. ఇక వయనాడ్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ బరిలో నిలవనున్నారు. ఆమె గెలిస్తే.. కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభలో బలం మళ్లీ వందకు చేరనుంది. ఏదీ ఏమైనా మోదీ ప్రభుత్వానికి ముప్పు ఆగస్ట్ సంక్షోభం రూపంలో పొంచి ఉందంటూ లాలూ చేసిన వ్యాఖ్యలను ఇండియా కూటమిలోని పార్టీల నేతలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jul 05 , 2024 | 06:07 PM