Share News

Bihar: మనీలాండరింగ్ కేసు.. లాలూ, తేజస్వీలకు ఈడీ సమన్లు

ABN , Publish Date - Jan 19 , 2024 | 08:14 PM

బిహార్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం భూములు(Land for job scam) తీసుకున్నారన్న కేసులో ఈడీ(ED) వరుసగా పలువురిని విచారిస్తూ వస్తోంది. శుక్రవారం డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. జనవరి 29న మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌ని హాజరుకావాలని ఆదేశించగా.. మరుసటి రోజే తేజస్వి రావాలని సూచిస్తూ సమన్లు జారీ చేసింది.

Bihar: మనీలాండరింగ్ కేసు..  లాలూ, తేజస్వీలకు ఈడీ సమన్లు

బిహార్ : బిహార్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం భూములు(Land for job scam) తీసుకున్నారన్న కేసులో ఈడీ(ED) వరుసగా పలువురిని విచారిస్తూ వస్తోంది. శుక్రవారం డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. జనవరి 29న మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌ని హాజరుకావాలని ఆదేశించగా.. మరుసటి రోజే తేజస్వి రావాలని సూచిస్తూ సమన్లు జారీ చేసింది. ఇదే కేసులో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మేనల్లుడు, ఎమ్మెల్యే రోహిత్ పవార్‌ ఈ నెల 24న హాజరుకావాలని గతంలోనే నోటీసులు ఇచ్చింది.

భూములు తీసుకుని ఉద్యోగాలిచ్చారనే ఆరోపణపై మనీ లాండరింగ్ కింద ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్‌కు సన్నిహితుడైన అమిత్ కత్యాల్‌ను ఈడీ గతంలో అరెస్టు చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్ యూపీఏ-1 మంత్రివర్గంలో కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఈ కుంభకోణం వెలుగుచూసింది. 2004-2009 మధ్య భారత రైల్వే జోన్లలో గ్రూప్-డీ పోస్టులకు గాను లాలూ కుటుంబీకులు, సన్నిహితులు భూములు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారని దర్యాప్తు సంస్థల ఆరోపణగా ఉంది.

కాగా, ఈ కుంభకోణంలో 2022 మార్చిలో ఢిల్లీ ఎన్‌సీఆర్, పాట్నా, ముంబై, రాంచీలోని 24 లొకేషన్లలో ఈడీ సోదాలు జరిపింది.


ఈ సోదాల్లో లెక్కల్లో చూపించని రూ.1 కోటి నగదు, విదేశీ కరెన్సీ, 540 గ్రాముల గోల్డ్ బులియన్, 1.5 కేజీల స్వర్ణాభరణాలతో పాటు పలు ప్రాపర్టీ పేపర్లు, సేల్ డీడ్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. రూ.600 కోట్లకు పైగా కుంభకోణం జరిగినట్టు ఈడీ చెబుతోంది.

2022 జులైలో సీబీఐ సైతం లాలూ ప్రసాద్, తేజస్వి యాదవ్, రబ్రీదేవిపై ఛార్జిషీటు దాఖలు చేసింది. తాజాగా కేసు విచారణలో భాగంగా ఈడీ ఎదుట హాజరుకావాలంటూ పలువురు నేతలకు సమన్లు జారీ చేయడం బిహార్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - Jan 19 , 2024 | 08:16 PM