ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Polls: బీహార్‌లో కాంగ్రెస్‌కు 9 సీట్లు ఇస్తామంటోన్న లాలు.. కండీషన్స్ అప్లై

ABN, Publish Date - Mar 28 , 2024 | 03:57 PM

బీహార్‌లో కూటమి సీట్ల లెక్క తేలడం లేదు. భాగస్వామ్య పక్షాల మధ్య ఒప్పందం కొలిక్కి రాకముందే రాష్ట్రీయ జనతా దళ్ తన అభ్యర్థులను ప్రకటించింది. కొందరికి టికెట్లను కూడా అందజేసింది. దీంతో అక్కడ కూటమి పోటీ చేసే స్థానాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇంతలో ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి మరో ఆఫర్ ఇచ్చారు.

పాట్నా: బీహార్‌లో (Bihar) కూటమి సీట్ల లెక్క తేలడం లేదు. భాగస్వామ్య పక్షాల మధ్య ఒప్పందం కొలిక్కి రాకముందే రాష్ట్రీయ జనతా దళ్ (RJD) తన అభ్యర్థులను ప్రకటించింది. కొందరికి టికెట్లను కూడా అందజేసింది. దీంతో అక్కడ కూటమి పోటీ చేసే స్థానాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇంతలో ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కాంగ్రెస్ పార్టీకి (Congress) మరో ఆఫర్ ఇచ్చారు.

9 సీట్లు ఇస్తాం.. కానీ

బీహార్‌లో కాంగ్రెస్ పార్టీకి 9 లోక్ సభ సీట్లు ఇస్తామని లాలు ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ ఇచ్చారు. ఆ నియోజకవర్గాల పేర్లను కూడా చెప్పినట్టు తెలుస్తోంది. కిషన్ గంజ్, కతియార్, ససారం, పాట్నా సహిబ్, బేటియా, ముజఫర్ నగర్, సమస్తిపూర్, భాగల్ పూర్, మధేపుర లేదంటే సుపౌల్ సీటును ఇస్తామని ప్రకటించారు. ఈ లోక్ సభ సీట్లు ఇవ్వాలంటే లాలు ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి కండీషన్ విధించారు.

కండీషన్ ఎంటంటే..?

కాంగ్రెస్ పార్టీకి బీహార్‌లో 9 లోక్ సభ సీట్లు ఇస్తే.. పక్కనే గల జార్ఖండ్ రాష్ట్రంలో తమ పార్టీకి రెండు సీట్లు ఇవ్వాలని లాలు ప్రసాద్ యాదవ్ మెలిక పెట్టారు. జార్ఖండ్‌లో ఛాత్ర, పాలము లోక్ సభ స్థానాల్లో పోటీ చేయాలని ఆర్జేడీ ఆసక్తి కనబరుస్తోంది. కాదు.. కూడదు అని కాంగ్రెస్ పార్టీ బెట్టు చేస్తే బీహార్‌లో హస్తం పార్టీకి ఆరు నుంచి ఏడు సీట్లను మాత్రమే కేటాయిస్తామని లాలు తేల్చిచెప్పారు.

సస్పెన్స్ కంటిన్యూ

బీహార్‌లో పూర్ణియా లోక్ సభ స్థానంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆ సీటును ఇటీవల పార్టీలో చేరిన పప్పు యాదవ్‌కు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇంతలో భీమా భారతిని ఆర్జేడీ బరిలోకి దింపింది. కూటమిలో ఉంటూ తమ అభిప్రాయానికి ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ గౌరవించడం లేదని కాంగ్రెస్ పార్టీ గుర్రుగా ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

Loksabha Polls: శ్వాస ఆగిపోయే వరకు పిలిభిత్‌తో అనుబంధం, వరుణ్ గాంధీ ఎమోషనల్
Sania Mirza: రంగంలోకి సానియా మిర్జా..!

Updated Date - Mar 28 , 2024 | 03:57 PM

Advertising
Advertising