Mumbai: అజిత్ పవార్‌కు ‘మహా’ షాక్
ABN, Publish Date - Jul 18 , 2024 | 05:08 AM
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలవేళ అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీకి (ఎన్‌సీపీ) ఎదురుదెబ్బ తగిలింది. నలుగురు ముఖ్యమైన నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేశారు.
నలుగురు ఎన్‌సీపీ నేతల రాజీనామా
శరద్ పార్టీలో చేరతారని ప్రచారం
ముంబై, జూలై 17: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలవేళ అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీకి (ఎన్‌సీపీ) ఎదురుదెబ్బ తగిలింది. నలుగురు ముఖ్యమైన నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో వారంతా శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ (ఎస్‌పీ)లో చేరే అవకాశం ఉంది. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌సీపీ మహారాష్ట్రలో చతికిలబడింది. ఆ పార్టీ ఒక్క ఎంపీ సీటును మాత్రమే దక్కించుకుంది. ఎన్‌సీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు తమ సంప్రదింపుల్లో ఉన్నారని ఎన్సీపీ(ఎ్‌సపీ) అధ్యక్షుడు శరద్ పవార్ ఇటీవల ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ నుంచి రాజకీయ వలసలు మొదలయ్యాయి. పింప్రీ-చించ్వాద్ యూనిట్ చీఫ్ అజిత్ గవహానే, యశ్ శనే, రాహుల్ భోస్లే, పంకజ్ భలేకర్‌లు ఎన్సీపీకి రాజీనామా చేశారు. తిరిగి శరద్ పవార్ శిబిరంలోకి వెళ్లే ఆలోచనలో అజిత్ పవార్ క్యాంపునకు చెందిన మరికొందరు నేతలు కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలాఉండగా, లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌సీపీతో పొత్తే బీజేపీని మహారాష్ట్రలో ముంచిందని ఆర్‌ఎ్‌సఎస్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆర్‌ఎస్‌ఎ్‌సకు చెందిన మరాఠా వారపత్రిక ‘వివేక్’లో దీనిపై ఒక విశ్లేషణాత్మక వ్యాసం ప్రచురించారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీతో చేతులు కలిపినప్పటినుంచి మహారాష్ట్ర ప్రజల దృష్టిలో బీజేపీ ప్రతిష్ఠ తగ్గిపోవడం మొదలైందని ఆ వ్యాసంలో స్పష్టం చేశారు.
Updated Date - Jul 18 , 2024 | 05:08 AM