ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

INDIA Alliance: ‘ఇండియా కూటమి’కి మరో ఝలక్.. హ్యాండిచ్చిన ఫరూక్ అబ్దుల్లా..

ABN, Publish Date - Feb 15 , 2024 | 05:14 PM

INDIA Alliance: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమికి ఆదిలోనే వరుస ఎదురుదెబ్బలకు తగులుతున్నాయి. అసలు ఈ కూటమి ఉంటుందా? ఊడుతుందా? అన్న పరిస్థితి ఏర్పడింది. ఉత్తరప్రదేశ్‌లో జయంత్ చౌదరి.. పంజాబ్‌లో భగవంత్ మాన్.. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో ఫరూక్ అబ్దుల్లా.. ఇండియా కూటమికి బిగ్ షాక్ ఇచ్చారు.

INDIA Alliance

INDIA Alliance: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమికి ఆదిలోనే వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అసలు ఈ కూటమి ఉంటుందా? ఊడుతుందా? అన్న పరిస్థితి ఏర్పడింది. ఉత్తరప్రదేశ్‌లో జయంత్ చౌదరి.. పంజాబ్‌లో భగవంత్ మాన్.. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో ఫరూక్ అబ్దుల్లా ఇండియా కూటమికి బిగ్ షాక్ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్‌లోని మొత్తం 5 లోక్‌సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా నిర్ణయించారు.

ఇండియా కూటమి ఏర్పాటు సమయం నుంచే ఫరూక్ అబ్దుల్లా కూటమిలో చాలా కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అన్ని సమావేశాల్లో పాల్గొన్నారు. ఇంతలోనే ఆయన ఈ నిర్ణయం ప్రకటించడం.. కూటమిలో కలకం రేపుతోంది. ఇప్పటికే వెస్ట్ బెంగాల్, పంజాబ్, ఢిల్లీలో ఇండియా కూటమికి ఆప్, టీఎంసీ పార్టీలు షాక్ ఇచ్చాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో కూడా సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీల మధ్య చర్చలు వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. ఇంతలో ఫరూక్ అబ్దుల్లా చేసిన ప్రకటన.. ఇండియా కూటమి భవిష్యత్‌ను అగమ్యగోచరంగా చేసేలా కనిపిస్తోంది.

ఢిల్లీలో కాంగ్రెస్‌కు ఒక్క సీటే..

ఆమ్ ఆద్మీ పార్టీ పీఏసీ సమావేశం తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్‌కు ఒక సీటు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఢిల్లీలో కాంగ్రెస్‌కు 1 సీటు ఇస్తున్నామని, ఆమ్ ఆద్మీ పార్టీ 6 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుందని ఆప్ ఎంపీ, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ సందీప్ పాఠక్ ప్రకటించారు. ఇండియా బ్లాక్‌లో సీట్ల పంపకంలో జాప్యం గురించి, ఆప్ ఎంపీ, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ సందీప్ పాఠక్ మాట్లాడుతూ.. ‘మేము కూటమిలోకి వచ్చినప్పుడు, మా స్వంత ప్రయోజనాల గురించి ఆలోచించలేదు. నిజాయితీ, అంకితభావంతో సఖ్యతగా ఉన్నాం. కానీ ఇండియా బ్లాక్ లక్ష్యం ఎన్నికల్లో పోటీ చేయడం, దేశానికి ప్రత్యామ్నాయాన్ని అందించడం. సకాలంలో అభ్యర్థులను ప్రకటించడం, ప్రచార వ్యూహం ఖరారు చేయడం కూడా కూటమి చేయాల్సిన ప్రధాన పని.’ అని అన్నారు.

యూపీ, బెంగాల్, అసోంలోనూ ఇదే పరిస్థితి.

ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ అసోంలోని 3 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌లో 80 సీట్లలో కాంగ్రెస్‌కు 11 సీట్లు మాత్రమే ఇవ్వాలని అఖిలేష్ యాదవ్ భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో కూడా మమతా బెనర్జీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ వరుస ప్రకటనలను చూస్తుంటే.. ఇండియా బ్లాక్ ఎంతోకాలం కొనసాగదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 15 , 2024 | 06:59 PM

Advertising
Advertising