Share News

Iskcon: డోనాల్డ్ ట్రంప్‌ను జగన్నాథుడే కాపాడాడు

ABN , Publish Date - Jul 15 , 2024 | 03:11 PM

ఎన్నికల ప్రచారంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై ఆదివారం హత్యాయత్నం జరిగింది. దీని నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనపై ఇస్కాన్ ప్రతినిధి స్పందించారు.

Iskcon: డోనాల్డ్ ట్రంప్‌ను జగన్నాథుడే కాపాడాడు

న్యూఢిల్లీ, జులై 15: ఎన్నికల ప్రచారంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై ఆదివారం హత్యాయత్నం జరిగింది. దీని నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనపై ఇంటర్నేషనల్ సొసైటి ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) ప్రతినిధి సోమవారం స్పందించారు. డోనాల్డ్ ట్రంప్‌ను ఆ జగన్నాథ స్వామి వారి దైవనుగ్రహమే కాపాడిందన్నారు.

గతంలో యూఎస్‌లో జగన్నాథుడి రథయాత్రకు డోనాల్డ్ ట్రంప్ సహాయ సహకారాలందించారని తెలిపారు. ఆ క్రమంలో ప్రస్తుతం జగన్నాథుడి రథయాత్ర జరుగుతున్న వేళ.. ట్రంప్‌పై ఈ విధంగా జరగడం.. ఆయన ప్రాణాలతో బయటపడడం అంతా ఆ స్వామి దయేనని ఇస్కాన్ ప్రతినిధి స్పష్టం చేశారు.


దాదాపు 48 ఏళ్ల క్రితం.. అంటే 1976, జులైలో యూఎస్‌లోని న్యూయార్క్ నగరంలో తొలి సారి జగన్నాథుడి రధయాత్ర నిర్వహించాలని ఇస్కాన్ నిర్ణయించిందని చెప్పారు. ఆ క్రమంలో రథాల తయారీకి పెద్ద ఖాళీ స్థలం కావాల్సి ఉందన్నారు. అందుకోసం న్యూయార్క్ నగరమంతా వెతికినట్లు గుర్తు చేశారు. కానీ ఎక్కడ అంత స్థలం లభించలేదన్నారు. ఆ సమయంలో డోనాల్డ్ ట్రంప్‌ను ఇస్కాన్ సంప్రదించిందని పేర్కొన్నారు.

అందుకు.. తన ట్రైన్ యార్డ్‌ను వినియోగించుకోవచ్చని ఇస్కాన్ ప్రతినిధులకు డోనాల్డ్ ట్రంప్ సూచించారని.. అదీ కూడా ఉచితంగా వాడుకోవచ్చునని ఆయన చెప్పారన్నారు. మరోవైపు ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా జగన్నాధుడి రధయాత్ర తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాంటి వేళ ట్రంప్‌పై హత్యాయత్నం జరగడం.. ఆయన ప్రాణాలతో బయటపడడం అంతా ఆ జగన్నాథుడి దయేనని ఇస్కాన్ ప్రతినిధి.. తన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

Also Read: Arvind Kejriwal: ఆరోగ్యంపై స్పందించిన తీహాడ్.. తొసిపుచ్చిన ఆప్


ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఆ క్రమంలో రిపబ్లిక్ పార్టీ తరఫున ట్రంప్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా ఆదివారం పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో ఓ వ్యక్తి ఆయనపై కాల్పులకు తెగబడ్డాడు. ఆ ఘటనలో ట్రంప్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ కాల్పుల ఘటనలో ఆయన కుడి చెవికి స్వల్ప గాయమైన సంగతి తెలిసిందే.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 15 , 2024 | 03:11 PM