Maharashtra: 'మహా' మంత్రివర్గ విస్తరణ... 39 మంది ప్రమాణస్వీకారం
ABN, Publish Date - Dec 15 , 2024 | 05:33 PM
బీజేపీ నుంచి 19 మంది, 11 మంది షిండే శివసేన నుంచి, తొమ్మిది మందిని ఎన్‌సీపీ నుంచి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. నాగపూర్‌లోని రాజ్‌భవన్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణ కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయుంచారు.
ముంబై: మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సారథ్యంలోని 'మహాయుతి' ప్రభుత్వంలో కొత్తగా 39 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీ నుంచి 19 మంది, 11 మంది షిండే శివసేన నుంచి, తొమ్మిది మందిని ఎన్‌సీపీ నుంచి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. నాగపూర్‌లోని రాజ్‌భవన్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణ కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయుంచారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఆ కార్యక్రమానికి హాజరయ్యరు. డిసెంబర్ 5న ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్, ఉపముఖ్యమంత్రులుగా అజిత్ పవార్, ఏక్‌నాథ్ షిండే ప్రమాణం చేశారు. అనంతరం తొలిసారి ఆదివారం మంత్రివర్గ విస్తరణ జరిగింది.
Omar Abdullah: ఈవీఎంలపై విశ్వాసం లేకుంటే... ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు
కొత్త మంత్రులు వీరే
బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే, రాధాకృష్ణ విఖే పాటిల్, ఆశిష్ షెలార్, చంద్రకాంత్ పాటిల్, గిరీష్ మహాజన్, గణేష్ నాయక్, మంగళ్ ప్రతాప్ లోథా, జయకుమార్ రావల్, పంకజ ముండే, అతుల్ సావే మంత్రులుగా ప్రమాణస్వీకారం నుంచి. కాగా, షిండే శివసేన నుంచి దాదా భుసే, శంభురాజ్ దేశాయ్, సంజయ్ రాథోడ్, గులాబ్‌రావు పాటిల్, ఉదయ్ సామంత్ ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఉన్నారు. అజిత్ పవార్ ఎన్‌సీపీ నుంచి మాణిక్రావు కోకటే, దత్తాత్రేయ్ విఠోభా భర్నే, హసన్ ముష్రిఫ్, అదితి సునీల్ టట్కరే, ధనంజయ్ ముండే ప్రమాణస్వీకారం చేశారు.
ఒకే దశలో ఎన్నికలు
288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20వ తేదీన ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. నవంబర్ 23న ఫలితాలు వెలువడ్డాయి. మహాయుతి కూటమి 230 స్థానాలను కైవసం చేసుకుని మరోసారి అధికార పగ్గాలు చేపట్టింది. కేబినెట్ విస్తరణలో భాగంగా 37 మందికి చోటు కల్పించగా, మహా క్యాబినెట్‌లో గరిష్టంగా 43 మందిని తీసుకునే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
PM Modi: జమిలి ఎన్నికల బిల్లుపై వెనక్కి తగ్గిన కేంద్రం
భారతీయ విద్యార్థులపై కెనడా కన్నెర్ర
For National News And Telugu News
Updated Date - Dec 15 , 2024 | 07:26 PM