ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Maharashtra Elections: డిప్యూటీ సీఎం హెలికాప్టర్, బ్యాగులు తనిఖీ చేసిన ఈసీ

ABN, Publish Date - Nov 13 , 2024 | 03:35 PM

ఎన్నికల ప్రచారం కోసం బుధవారంనాడు బారామతి వచ్చినప్పుడు ఎన్నికల అధికారులు తన బ్యాగులను తనిఖీ చేసినట్టు అజిత్ పవార్ ఒక ట్వీట్‌లో తెలిపారు. బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్‌సీపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు.

బారామతి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Assembly Elections) ప్రచారంలో రాజకీయ నాయకుల బ్యాగుల తనిఖీలు కొనసాగుతున్నాయి. శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ థాకరే ప్రచారానికి వచ్చినప్పుడు ఈసీ అధికారులు ఆయన బ్యాగులను మంగళవారంనాడు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తాజాగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) విషయంలోనూ ఇదే జరిగింది. ఎన్నికల ప్రచారం కోసం బుధవారంనాడు బారామతి వచ్చినప్పుడు ఎన్నికల అధికారులు తన బ్యాగులను తనిఖీ చేసినట్టు అజిత్ పవార్ ఒక ట్వీట్‌లో తెలిపారు. బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్‌సీపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు.

Nitish Touch PM Feet: మళ్లీ మోదీ పాదాలకు మొక్కిన నితీష్


''ఈరోజు నేను ఎన్నికల ప్రచారంలో ఉండగా ఎన్నికల కమిషన్ అధికారులు రొటీన్‌గా నా హెలికాప్టర్, బ్యాగులను తనిఖీ చేశారు. నేను పూర్తిగా సహకరించాను. స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు జరగడానికి ఇలాంటి చర్యలు తప్పనిసరని నేను నమ్ముతున్నాను. చట్టాన్ని అందరూ గౌరవించాలి. ప్రజాస్వామ్య సమగ్రతను పరిరక్షించాలి'' అని అజిత్ పవార్ ట్వీట్ చేశారు.


డర్టీ పాలిటిక్స్: సుప్రియ

దీనికి ముందు, లూతూర్‌లో ఎన్నికల ప్రచారానికి ఉద్ధవ్ థాకరే వచ్చినప్పుడు ఆయన బ్యాగులు, హెలికాప్టర్‌ను ఈసీ అధికారులు తనిఖీ చేశారు. దీనిపై థాకరే ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మోదీ, దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్ బ్యాగులను కూడా ఇదే తరహాలో తనిఖీ చేస్తారా అని నిలదీశారు. ఈ చర్యను ఎన్‌సీపీ-ఎస్‌సీపీ నేత సుప్రియా సూలే ఖండించారు. థాకరే బ్యాగులు రెండు సార్లు తనిఖీ చేశారని, అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల బ్యాగులు మాత్రం తనిఖీ చేయరని అన్నారు. విపక్ష నేతల బ్యాగులే ఎందుకు చెక్ చేస్తు్న్నారని ప్రశ్నించారు. మహారాష్ట్రలో డర్టీ పాలిటిక్స్ నడుస్తున్నాయని విమర్శించారు.


నటి కస్తూరి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు

ఆ వినాశనం మీకే తెలుసు ఖర్గే!

For More National And Telugu News

Updated Date - Nov 13 , 2024 | 03:36 PM