ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎమ్మెల్యేలను కొనడం.. ప్రభుత్వాలను కూల్చడం!

ABN, Publish Date - Nov 12 , 2024 | 04:10 AM

ఎమ్మెల్యేలను కొనడం, ప్రభుత్వాలను కూల్చడం, ప్రతిపక్షాలను అణచేయడం.. ఇవే ప్రధాని మోదీకి తెలుసంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విరుచుకుపడ్డారు.

  • మోదీకి తెలిసింది అదే: ఖర్గే

న్యూఢిల్లీ, నవంబరు 11: ఎమ్మెల్యేలను కొనడం, ప్రభుత్వాలను కూల్చడం, ప్రతిపక్షాలను అణచేయడం.. ఇవే ప్రధాని మోదీకి తెలుసంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విరుచుకుపడ్డారు. బీజేపీ ‘విభజన’ ఎన్నికల నినాదాలు కేవలం తమకు కావాల్సిన కొందరు వ్యాపారవేత్తల కోసమేనని ఆరోపించారు. సోమవారం ఝార్ఖండ్‌లో పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఖర్గే మాట్లాడారు. అదానీ, అంబానీతో కలసి మోదీ, అమిత్‌ షా కేంద్రాన్ని నడుపుతున్నారన్నారు. ‘ఇచ్చిన హామీలను ఎన్నటికీ నెరవేర్చని ఓ అబద్ధాల కోరు మోదీ.. కనీసం మణిపూర్‌ను సందర్శించే ధైర్యం చేయలేకపోతున్నారాయన.. సుదీర్ఘ బీజేపీ పాలన నడుస్తున్న గుజరాత్‌లో ఏమైనా స్వర్ణయుగం వచ్చిందా..? కాషాయ వస్త్రాలతో సాధువుల్లా వచ్చి కొందరు ముఖ్యమంత్రులు (యోగిని ఉద్దేశించి) అయ్యారు. విభజిస్తే నరికేస్తామంటూ ఉగ్రవాదుల భాష మాట్లాడుతున్నారు’ అంటూ వ్యాఖ్యానించారు. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఖర్గేను హిందూ వ్యతిరేకి, సనాతన వ్యతిరేకిగా అభివర్ణించింది.

Updated Date - Nov 12 , 2024 | 04:11 AM