CWC Meet: ఎన్నికల ఫలితాలు ఓ సవాల్.. ఐక్యంగా పార్టీని బలోపేతం చేయాలి: ఖర్గే దిశానిర్దేశం
ABN, Publish Date - Nov 29 , 2024 | 05:28 PM
నాలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం పార్టీకి ఒక సవాలని శుక్రవారంనాడిక్కడ జరిగిన సీడీబ్ల్యూసీ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించినప్పటికీ ఆ తర్వాత జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో 'ఇండియా' కూటమి ఫలితాలు సాధించలేకపోవడం, భవిష్యత్ కార్యాచరణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమీక్షించింది. నాలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం పార్టీకి ఒక సవాలని శుక్రవారంనాడిక్కడ జరిగిన సీడీబ్ల్యూసీ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. ఎన్నికల ఫలితాల నుంచి తక్షణమే గుణపాఠం నేర్చుకోవాలని, పార్టీ బలహీనతలను సరిదిద్దుకోవాలని దిశానిర్దేశం చేశారు.
Supreme Court: సంభాల్ ఘర్షణలపై ఉత్తర్వులు ఇవ్వొద్దని ట్రయిల్ కోర్టుకు సుప్రీం ఆదేశం
వయనాడ్ లోక్‌సభ నుంచి విజయం సాధించిన ప్రియాంక గాంధీ, నాందేడు ఎంపీ రవీంద్ర వసంతరావు చహన్‌కు సీడబ్ల్యూసీ అభినందలు తెలిపింది. ఎన్నికల్లో ఐక్యంగా ఉంటేనే పార్టీ విజయాలను సాధిస్తుందని, పార్టీ బలంగా ఉంటేనే వ్యక్తులు బలంగా ఉంటారని ఖర్గే ఈ సందర్భంగా అన్నారు. సంస్థాగతంగా కింది స్థాయి నుంచి పార్టీని బలపోతంచేయాలని ఆయన అన్నారు. జాతీయ సమస్యలే కాకుండా, రాష్ట్ర స్థాయి సమస్యలను కూడా ఎజెండా తీసుకుని పార్టీ పోరాటం సాగించాలని అన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక అసమానతలు అనే సమస్యలు ఉన్నాయని, కులగణన కూడా ఒక ముఖ్యమైన అంశమని అన్నారు. ఎన్నికలకు ఏడాదికి ముందే సన్నాహాలు చేసుకోవాలని, విజయాలకు నూతన పద్ధతులను అవలభించాయని ఖర్గే దిశానిర్దేశం చేశారు.
రాజ్యాంగాన్ని అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని ఆయన అన్నారు. సామాన్య ప్రజలకు రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించినది కాంగ్రెస్ మాత్రమేనని చెప్పారు. ఎన్నికల ప్రక్రియల ఈవీఎంల తీరు అనుమానాస్పదంగా ఉందని ఆయన పునరుద్ధాటించారు. సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పి.చిదంబరం, అభిషేక్ మను సింఘ్వి, దిగ్విజయ్ సింగ్, సచిన్ పైలట్, డీకే శివకుమార్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
MP Kanimozhi: ఆ జాలర్లను విడిపించండి..
Chennai: హాయిగా ఊపిరి పీల్చుకోండి..
Read More National News and Latest Telugu News
Updated Date - Nov 29 , 2024 | 05:28 PM