ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

National : నీట్‌ స్కామ్‌కు మోదీ సర్కారుదే బాధ్యతమల్లికార్జున ఖర్గే ధ్వజం

ABN, Publish Date - Jun 24 , 2024 | 03:20 AM

నీట్‌’ కుంభకోణాని’కి మోదీ ప్రభుత్వానిదే బాధ్యత అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. బీజేపీ వల్ల కుళ్లిపోయిన విద్యా వ్యవస్థ.. అధికారులను మార్చినంత మాత్రాన బాగుపడదని శనివారం ‘ఎక్స్‌’ పోస్టులో వ్యాఖ్యానించారు.

నీట్‌ స్కామ్‌కు మోదీ సర్కారుదే బాధ్యత: ఖర్గే

న్యూఢిల్లీ, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): ‘నీట్‌’ కుంభకోణాని’కి మోదీ ప్రభుత్వానిదే బాధ్యత అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. బీజేపీ వల్ల కుళ్లిపోయిన విద్యా వ్యవస్థ.. అధికారులను మార్చినంత మాత్రాన బాగుపడదని శనివారం ‘ఎక్స్‌’ పోస్టులో వ్యాఖ్యానించారు. ఇప్పుడు నీట్‌-పీజీని వాయిదా వేశారని, గత పది రోజుల్లో నాలుగు పరీక్షలను వాయిదా వేయడమో, రద్దు చేయడమో చేశారని గుర్తుచేశారు.

విద్యా వ్యవస్థలోకి ప్రశ్నపత్రాల లీక్‌లు, అవినీతి, అక్రమాలు, మాఫియా చొరబడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. పేపర్‌ లీక్‌ రాకెట్‌, మాఫియా ముందు ప్రధాని మోదీ నిస్సహాయంగా మారారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు.

నీట్‌-పీజీ వాయిదా పడడం మోదీ హయాంలో ధ్వంసమైన విద్యా వ్యవస్థకు మరో ఉదాహరణ అని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం విద్యావ్యవస్థను, పిల్లల భవిష్యత్తును మాఫియా, అవినీతిపరులు, భజనపరులైన అసమర్థుల చేతుల్లో పెట్టిందని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ఒక్క పరీక్షను కూడా సక్రమంగా పారదర్శకంగా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. యువత భవిష్యత్తుకు బీజేపీయే అతిపెద్ద అడ్డంకిగా మారిందన్నారు.

Updated Date - Jun 24 , 2024 | 03:20 AM

Advertising
Advertising