TMC : ప్రియాంకకు మద్దతుగా మమత ప్రచారం
ABN, Publish Date - Jun 22 , 2024 | 03:19 AM
కేరళలోని వయనాడ్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్న ప్రియాంక గాంధీ తరఫున ప్రచారం చేయడానికి టీఎంసీ అధినేత్రి మమత వెళ్లనున్నారు.
కోల్కతా, జూన్ 21: కేరళలోని వయనాడ్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్న ప్రియాంక గాంధీ తరఫున ప్రచారం చేయడానికి టీఎంసీ అధినేత్రి మమత వెళ్లనున్నారు. రెండు పార్టీల మధ్య సఖ్యత కుదిరింది. లోక్సభ ఎన్నికల రెండు పార్టీల మధ్య దూరం పెరగడంతో గాంధీ కుటుంబం తరఫున ప్రత్యేక దూతగా సీనియర్ నాయకుడు పి.చిదంబరం ఇటీవల కోల్కతా వచ్చి రాష్ట్ర సచివాలయంలో మమతతో చర్చలు జరిపారు.
తర్వాత పరిస్థితుల్లో మార్పులు కనిపించాయి. మమత పట్ల బద్ధ విరోధిగా వ్యవహరించిన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌధరి కూడా మెత్తబడ్డారు. మమతతో తనకు ఎలాంటి వ్యక్తిగత విద్వేషాలు లేవని స్పష్టం చేశారు. రాజకీయంగానే ఆమెను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. కాగా, నూతన క్రిమినల్ చట్టాల అమలును వాయిదా వేయాలని ప్రధాని మోదీకి మమత లేఖ రాశారు.
Updated Date - Jun 22 , 2024 | 07:00 AM