Maratha quota: మరాఠా రిజర్వేషన్లపై రగడ.. ఫడ్నవీస్‌పై మనోజ్ వ్యాఖ్యలను ఖండించిన మహారాష్ట్ర సీఎం షిండే
ABN, Publish Date - Feb 26 , 2024 | 10:48 AM
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తారని మరాఠీ రిజర్వేషన్ల ఉద్యమ నేత మనోజ్ సంచలన ఆరోపణలు చేశారు. మనోజ్ వ్యాఖ్యలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఖండించారు. తమ ప్రభుత్వ సహనాన్ని పరీక్షించొద్దని తేల్చిచెప్పారు.
ముంబై: మహారాష్ట్రలో మరాఠీల రిజర్వేషన్ల కోసం మనోజ్ జరాంగే (Manoj Jarange) ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. అందులో భాగంగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) ఇంటిని ముట్టడిస్తామని ప్రకటన చేశారు. శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ఆ తర్వాత విరమించుకున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని, శాంతియుతంగా ఆందోళన తెలియజేయాలని మరాఠీలకు మనోజ్ పిలుపునిచ్చారు. ఎవరూ కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు. ఆ సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్‌పై మనోజ్ సంచలన ఆరోపణలు చేశారు. మరాఠీల కోసం ఉద్యమిస్తోన్న తనను హత్య చేసేందుకు ఫడ్నవీస్ ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. విషంతో ఉన్న సెలైన్ తనకు ఎక్కించాలని చూశారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మనోజ్ చేసిన కామెంట్లు మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది.
మనోజ్ వ్యాఖ్యలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) తప్పు పట్టారు. ఫడ్నవీస్ గురించి చేసిన వ్యాఖ్యలు సరికాదని సూచించారు. తమ ప్రభుత్వ సహనాన్ని పరీక్షించొద్దని తేల్చిచెప్పారు. షిండే కామెంట్లను బట్టి చూస్తే మహారాష్ట్రలో మరాఠీ రిజర్వేషన్ల అంశం ఇప్పట్లో తెలేలా అనిపించడం లేదు.మరాఠీల కోసం ఉద్యమిస్తోన్న మనోజ్ తివారీ వెనకాల ఎవరో ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. యూబీటీ చీఫ్ ఉద్దవ్ థాకరే, శరద్ పవార్ చెప్పినట్టు మనోజ్ వింటున్నారని ఆరోపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 26 , 2024 | 10:48 AM