ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MP Mahua Moitra : న్యాయమూర్తులు భయపడుతున్నారు

ABN, Publish Date - Jul 06 , 2024 | 03:20 AM

ప్రతిపక్ష నేతల కేసుల్లో న్యాయమూర్తులు న్యాయం చేయడానికి భయపడుతున్నారని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా అన్నారు.

  • అందుకే విపక్ష నేతలకు బెయిలు ఇవ్వట్లే: మహువా మొయిత్రా

న్యూఢిల్లీ, జూలై 5: ప్రతిపక్ష నేతల కేసుల్లో న్యాయమూర్తులు న్యాయం చేయడానికి భయపడుతున్నారని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా అన్నారు. ప్రభుత్వానికి ఎక్కడ కోపం వస్తుందేమోనన్న భయంతో బెయిలు నిరాకరిస్తున్నారని ఆరోపించారు. మూడు రోజుల క్రితం లోక్‌సభ సమావేశాల చివరిరోజు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ మహువా ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం అవి సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతున్నాయి. న్యాయమూర్తులు దేవుళ్లు కారని, ప్రజల పట్ల సహానుభూతితో పని చేయాలని ఇటీవల సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలను మొయిత్రా ప్రస్తావించారు. ఎక్కడా సగం గర్భం ఉండదని, అయితే కడుపుతో ఉన్నారని లేదా లేరని మాత్రమే అంటారని అన్నారు. ప్రజాస్వామ్యంలో న్యాయం కూడా సంపూర్ణమైనదిగా ఉండాలని స్పష్టం చేశారు. కొద్దిగానే ప్రభావవంతంగా ఉంటానంటే కుదరదని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, జాతీయ మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు రేఖా శర్మపై మహువా శుక్రవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హత్రాస్‌ తొక్కిసలాట జరిగిన సంఘటన స్థలాన్ని రేఖా శర్మ శుక్రవారం సందర్శించారు. అక్కడ బంట్రోతు గొడుగు పట్టుకొని రేఖాశర్మ వెనుక నడుస్తున్న వీడియో వైరల్‌ అయ్యింది. రేఖకు అంత అధికార దర్పం ఎందుకని విమర్శలు వెల్లువెత్తాయి.

చైర్‌పర్సన్‌ తన గొడుగు తాను పట్టుకొని నడవలేరా? అని ఎవరో వేసిన ప్రశ్నకు మొహువా మొయిత్రా సమాధానం ఇస్తూ.. ఆమె తన బాస్‌(మోదీ) పరువు కాపాడే పనిలో బిజీగా ఉన్నారనే అర్థం వచ్చేలా పోస్టు చేశారు. మహువా వ్యాఖ్యను తీవ్రంగా పరిగణించిన మహిళా కమిషన్‌ 3రోజుల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.

Updated Date - Jul 06 , 2024 | 03:22 AM

Advertising
Advertising