మా కోర్కేలు తీర్చండి.. కేంద్రాన్ని కోరిన జేడీయూ.. జాతీయ మహాసభల్లో తీర్మానం
ABN, Publish Date - Jun 29 , 2024 | 04:04 PM
బీహార్‌కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ మంజూరు చేయాలని జనతాదళ్ (యునైటెడ్)-JDU శనివారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈమేరకు ఆ పార్టీ జాతీయ మహాసభల్లో తీర్మానం చేసింది.
బీహార్‌కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ మంజూరు చేయాలని జనతాదళ్ (యునైటెడ్)-JDU శనివారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈమేరకు ఆ పార్టీ జాతీయ మహాసభల్లో తీర్మానం చేసింది. అలాగే నీట్ పేపర్ లీకేజీ ఘటనపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వాన్ని కోరింది. పరీక్షల్లో అక్రమాలను అరికట్టడానికి పార్లమెంట్‌లో బలమైన చట్టాన్ని ఆమోదించాలని జేడీయూ కోరింది. సమావేశం అనంతరం జెడి(యు) నేత నీరజ్ కుమార్ మాట్లాడుతూ.. ఈరోజు జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో రెండు ముఖ్యమైన ప్రతిపాదనలు ఆమోదించినట్లు తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, బీహార్ సీఎం నితీష్ కుమార్.. సంజయ్ ఝాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండాలని నిర్ణయించారన్నారు. తాము ఎప్పటికీ ఎన్డీయే భాగస్వామిపక్షంగా ఉంటామన్నారు.
Parliament : నీట్‌పై దద్దరిల్లిన పార్లమెంటు
రిజర్వేషన్లపై..
కుల రిజర్వేషన్లపై పాట్నా హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలని జెడి(యు) జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించినట్లు పార్టీ సీనియర్ నేత కెసి త్యాగి తెలిపారు. జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన రాజ్యసభ ఎంపీ సంజయ్ ఝా మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా, ఆర్థిక ప్యాకేజీ కోసం పోరాడుతూనే ఉంటామన్నారు. మరోవైపు జేడీయూ తెరపైకి తీసుకొచ్చిన డిమాండ్‌కు కేంద్రం అంగీకారం తెలిపి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తే.. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాల్సి వస్తుంది. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటినుంచో వినిపిస్తోంది. కానీ కేంద్రప్రభుత్వం మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వబోమని.. అవసరమైతే ఆర్థిక సహాయం అందిస్తామని అనేకసార్లు చెప్పింది. ఈనేపథ్యంలో బీహార్‌కు సైతం ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని.. ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీహార్ ఎలాంటి వరాలు కేంద్రం ఇస్తుందో.. దానికి సమానంగా ఏపీకి ఇవ్వాల్సి ఉంటుందనే చర్చ జరుగుతోంది.
Ajith category MLAs : అజిత్ వర్గం ఎమ్మెల్యేలు తిరిగి పవార్ గూటికి?
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest National News and Telugu News
Updated Date - Jun 29 , 2024 | 04:04 PM