ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kolkata: సీఎంతో చర్చలకు జూనియర్ డాక్టర్లు రెడీ

ABN, Publish Date - Sep 11 , 2024 | 03:48 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఘటనపై వైద్యులు చేపట్టిన నిరసన బుధవారంతో 33వ రోజుకు చేరుకుంది. ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ ఇదే సమయంలో ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలు జరిగినట్టు గుర్తించి, ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్‌ను అరెస్టు చేసింది.

kolkata agitation

కోల్‌కతా: ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనపై నిరసనలు కొనసాగిస్తున్న డాక్టర్లు నేరుగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)తో సమావేశమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. సీఎంతో సమావేశం కోరుతూ ఈ-మెయిల్ పంపాలని నిర్ణయించారు. రాష్ట్ర హెల్త్ సెక్రటేరియట్ 'స్వాస్థ్య భవన్' వెలువల జూనియర్ డాక్టర్లు నిరసనలు చేపట్టారు. ఆగస్టు 9న జరిగిన అత్యాచారం, హత్య ఘటనలో దోషులను శిక్షించాలని, కోల్‌కతా పోలీస్ కమిషనర్, హెల్త్ సెక్రటరీ సహా ఉన్నతాధికారులు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


తాజా పరిణామాలపై నిరసనల్లో పాల్గొంటున్న వైద్యుల ప్రతినిధి డాక్టర్ అనికేత్ మండల్ మాట్లాడుతూ, తమతో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయని, దీనిపై స్పష్టత కోసం సీఎం కార్యాలయానికి మెయిల్ పంపుతున్నామని, తమ డిమాండ్లు కూడా అందులో చేరుస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రితో తాము మాట్లాడాలనుకుంటున్నట్టు తెలిపారు.


33వ రోజుకు చేసిన నిరసనలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఘటనపై వైద్యులు చేపట్టిన నిరసన బుధవారంతో 33వ రోజుకు చేరుకుంది. ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ ఇదే సమయంలో ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలు జరిగినట్టు గుర్తించి, ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్‌ను అరెస్టు చేసింది.


ప్రభుత్వ లేఖపై వైద్యుల వివరణ

జూనియర్ డాక్టర్ల నిరసనతో తలెత్తిన ప్రతిష్ఠంభనను తొలగించేందుకు రాష్ట్ర సచివాలయంలో చర్చలకు ఆహ్వానిస్తూ వారికి లేఖ రాసినట్టు ప్రభుత్వం ఇంతకుముందు తెలిపింది. తాము ఎవరైతే రాజీనామా చేయాలని అడుగుతున్నామో ఆ హెల్త్ సెక్రటరీ నుంచే తమకు మెయిల్ వచ్చిందని, ఇది తమను అవమాన పరచడమేనని నిరసనల్లో పాల్గొంటున్న వైద్యులు తెలిపారు. సెప్టెంబర్ 10వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా వైద్యులు విధుల్లోకి చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ వైద్యులు తమ నిరసనలు కొనసాగించేందుకే నిర్ణయించారు. తమ డిమాండ్లు నెరవేరేంత వరకూ విధుల్లో చేరేది లేదని భీష్మించారు. దీంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది.


Read More Nationa News and Latest Telugu News

Amit Shah: రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై అమిత్ షా ట్వీట్..

Updated Date - Sep 11 , 2024 | 04:19 PM

Advertising
Advertising