ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Congress: పేపర్ లీక్ ప్రభుత్వం.. బీజేపీపై విరుచుకుపడిన కాంగ్రెస్

ABN, Publish Date - Jun 20 , 2024 | 10:20 AM

యూజీసీ-నెట్ పరీక్షలను రద్దు(UGC-NET Exams Cancelled) చేయడంతో మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ విరుచుకుపడింది. ఎన్డీయే సర్కార్‌ని "పేపర్ లీక్ ప్రభుత్వం"గా అభివర్ణించింది. పేపర్ లీక్‌కు విద్యాశాఖ మంత్రి బాధ్యులుగా మారతారా అని కాంగ్రెస్ ప్రశ్నించింది.

ఢిల్లీ: యూజీసీ-నెట్ పరీక్షలను రద్దు(UGC-NET Exams Cancelled) చేయడంతో మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ విరుచుకుపడింది. ఎన్డీయే సర్కార్‌ని "పేపర్ లీక్ ప్రభుత్వం"గా అభివర్ణించింది. పేపర్ లీక్‌కు విద్యాశాఖ మంత్రి బాధ్యులుగా మారతారా అని కాంగ్రెస్ ప్రశ్నించింది.యువత భవిష్యత్తుతో మోదీ ప్రభుత్వం ఆడుకుంటోందని ఆవేదన వ్యక్తం చేసింది.

'యూజీసీ-నెట్ పరీక్ష పేపర్ లీక్ అవుతుందన్న అనుమానంతో పరీక్షను రద్దు చేశారు. మొదట నీట్ పేపర్ లీక్ కాగా.. ఇప్పుడు యూజీసీ-నెట్ పేపర్ లీకవుతుందన్న భయంతో రద్దు చేశారు. మోదీ ప్రభుత్వం పేపర్ లీక్ ప్రభుత్వంగా మారింది" అని కాంగ్రెస్ ఎక్స్‌లో విమర్శించింది.


నీట్ పరీక్షా పే చర్చ చేపట్టండి..

మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్‌లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. మోదీ ‘నీట్‌ పరీక్షా పే చర్చ’ను ఎప్పుడు నిర్వహిస్తారని ప్రశ్నించారు."మోదీజీ.. మీరు పరీక్షల సందర్భంలో విద్యార్థులతో చాలా చర్చిస్తారు. మరి నీట్ పరీక్షా పే చర్చను ఎప్పుడు నిర్వహిస్తారు. UGC-NET పరీక్షను రద్దు చేయడం లక్షలాది మంది విద్యార్థుల విజయం.నీట్‌లో పేపర్‌ లీక్‌ కాలేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి మొదట చెప్పారు. అయితే బిహార్‌, గుజరాత్‌, హరియాణాలో ఈ కేసులో అరెస్టులు జరిగినప్పుడు ఏదో స్కామ్‌ జరిగిందని మంత్రి అంగీకరించారు. లీక్‌కు బాధ్యత వహించండి" అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు ఖర్గే. నీట్ పరీక్ష లీకేజ్ బీజేపీ అవినీతి, అలసత్వానికి నిదర్శనమని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు.

"నీట్ పరీక్ష లీక్ తరువాత ఇప్పుడు మరోసారి లీకుల భయంతో జూన్ 18 న జరిగిన నెట్ పరీక్షను కూడా రద్దు చేశారు. ఈ అలసత్వానికి విద్యా శాఖ మంత్రి బాధ్యత వహిస్తారా?" అని ప్రియాంక ప్రశ్నించారు.

For Latest News and National News click here

Updated Date - Jun 20 , 2024 | 10:27 AM

Advertising
Advertising