ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Budget 2024: రైతులకు మరో శుభవార్త.. ఈ బడ్జెట్ సమావేశంలోనే..

ABN, Publish Date - Jul 19 , 2024 | 01:45 PM

PM Kisan Scheme: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జులై 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 23వ తేదీన లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర బడ్జెట్‌కు మరికొద్ది రోజులే సమయం ఉండటంతో.. దేశ వ్యాప్తంగా వివిధ రంగాల నుంచి ఎన్నో ఆశలు, అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

PM Kisan Scheme

PM Kisan Scheme: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జులై 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 23వ తేదీన లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర బడ్జెట్‌కు మరికొద్ది రోజులే సమయం ఉండటంతో.. దేశ వ్యాప్తంగా వివిధ రంగాల నుంచి ఎన్నో ఆశలు, అంచనాలు వ్యక్తమవుతున్నాయి. యువత, మహిళలు, రైతులు, శ్రమ జీవులు, పారిశ్రామిక వేత్తలు సహా అనేక వర్గాల ప్రజలు కేంద్ర బడ్జెట్‌పై ఎంతో ఆశగా చూస్తున్నారు. అయితే, ఈ బడ్జెట్‌లో ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు, కూలీలకు సంబంధించి కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.


ప్రధానంగా అన్నదాతలకు సంబంధించి ఉన్న పథకాలను విస్తరించడంతో పాటు.. మరికొన్ని కొత్త పథకాలను ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రైతులకు సంబంధించి ఉన్న కేంద్ర పథకాలలో పీఎం కిసాన్ కీలకమైంది. 2019లో ప్రారంభించిన ఈ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా 10 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. ఈ పథకం కింద రైతులకు ఏడాదికి రూ. 6 వేలు పెట్టుబడి సాయంగా కేంద్రం అందిస్తోంది. అయితే, ఈ రూ. 6 వేలు సరిపోదని.. ఈ మొత్తాన్ని పెంచాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేంద్రం నుంచి కూడా ఈ రూ. 6 వేలు మొత్తాన్ని పెంచే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. పీఎం కిసాన్ నిధిని రూ. 6 వేల నుంచి రూ. 8 వేలకు పెంచాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే దీనిపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు కేంద్ర ప్రభుత్వ వర్గాలు.


పీఎం కిసాన్ స్కీమ్ వివరాలు..

కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రైతులకు మూడు విడతలుగా రూ. 2 వేలు చొప్పున సంవత్సరానికి రూ. 6 వేలు సాయం చేస్తోంది. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. పథకం ప్రారంభించినప్పటి నుంచి ప్రభుత్వం ఇప్పటి వరకు 17 వాయిదాలు చెల్లించింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ. 3 లక్షల కోట్లకు పైగా లబ్ధిదారులకు పంపిణీ చేసింది. జూన్ నెలలో 17 విడతగా రూ. 20 వేల కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకానికి ఏడాదికి రూ. 55 వేల కోట్ల నుంచి 65 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అయితే, ఈ పథకాన్ని రూ. 6 నుంచి 8 వేలకు పెంచితే.. ఏడాదికి మరో రూ. 20 వేల కోట్ల భారం ఖజానాపై పడనుందని కేంద్ర అధికారులు చెబుతున్నారు.


పీఎం కిసాన్ పథకానిక ఇలా దరఖాస్తు చేసుకోండి..

  • మీకు వ్యవసాయ భూమి ఉందా? పీఎం కిసాన్ నిధి పథకంలో ఇంకా చేరలేదా? మరెందుకు ఆలస్యం ఇలా రిజిస్టర్ చేసుకోండి. ఈ పథకాన్ని ఆన్‌లైన్‌లో గానీ, మీకు సమీపంలో ఉన్న రైతు కేంద్రం వద్ద కూడా అప్లై చేసుకోవచ్చు.

  • ముందుగా పీఎం కిసాన్ స్కీమ్ అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ఓపెన్ చేయాలి.

  • హోమ్ పేజీలో కొంచెం క్రిందికి స్క్రోల్ చేస్తే.. ఫార్మర్స్ కార్నర్ కనిపిస్తుంది.

  • ఇక్కడ న్యూ ఫార్మర్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

  • ఇక్కడ మీరు మీ ఆధార్ నంబర్, ఫోన్ నంబర్‌ను నమోదు చేసి, మీ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి.

  • మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని సబ్‌మిట్ చేయాలి.

  • ఆ తరువాత మీరు మీ భూమికి సంబంధించిన సర్వే నంబర్ వంటి సమాచారాన్ని అందించాలి.

  • మీ పేరు పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి.

  • పీఎం కిసాన్ యోజన వెబ్‌సైట్‌లోని రైతుల కార్నర్ విభాగంలో లబ్ధిదారుల జాబితా ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

  • మీ రాష్ట్రం, జిల్లా, తాలూకా, గ్రామాన్ని ఎంచుకోవాలి.

  • మీ గ్రామంలోని పీఎం కిసాన్ లబ్ధిదారులందరి జాబితా ఓపెన్ అవుతుంది.

  • అందులో మీ పేరు ఉందో లేదో చూసుకోండి.

For More National News and Telugu News..

Updated Date - Jul 19 , 2024 | 01:45 PM

Advertising
Advertising
<