PM Narendra Modi: కాంగ్రెస్ అణుబాంబు వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్ట్రాంగ్ రియాక్షన్
ABN, Publish Date - May 11 , 2024 | 03:10 PM
పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలున్నాయంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. ఇప్పటికే వర్చువల్‌గా చనిపోయిన ఈ వ్యక్తులు..
పాకిస్తాన్ (Pakistan) వద్ద అణ్వాయుధాలున్నాయంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ (Mani Shankar Aiyer) చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) విరుచుకుపడ్డారు. ఇప్పటికే వర్చువల్‌గా చనిపోయిన ఈ వ్యక్తులు.. ఇప్పుడు భారతదేశ ఆత్మని కూడా చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. సొంత దేశ ప్రజలనే భయపెట్టేందుకు కాంగ్రెస్ (Congress) కొత్త మార్గాల్ని వెతుకుతోందంటూ ఆరోపించారు. పాక్ వద్ద అణ్వాయుధాలు ఉన్నా.. వాటిని ఉంచుకోవాలా? వద్దా? అనే దీనస్థితిలో ఆ దేశం ఉందంటూ సెటైర్లు వేశారు. ఒడిశాలోని కంధమాల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మోదీ రిటైర్ అవుతున్నారు.. మీ ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరు..?
‘‘కాంగ్రెస్ పార్టీ మళ్లీ పదే పదే తన సొంత దేశాన్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి, ఆ దేశాన్ని గౌరవించాలని వాళ్లు చెప్తున్నారు. చచ్చిన శవంలా మారిన ఈ వ్యక్తులు భారతదేశ ఆత్మను సైతం చంపుతున్నారు. పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు ఉండొచ్చు కానీ, వాటిని ఎలా ఉంచుకోవాలో వారికి తెలియడం లేదు. తమ బాంబులను విక్రయించేందుకు వాళ్లు కొనుగోలుదారుల కోసం వెతుకుతున్నారు. కానీ.. ఆ బాంబుల నాణ్యత గురించి ప్రజలకు తెలుసు కాబట్టి, వాటిని కొనేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు’’ అని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. గత 60 ఏళ్లుగా జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) ప్రజలు తీవ్రవాదాన్ని (Terrorism) ఎదుర్కొన్నారని, అందుకు కారణం కాంగ్రెస్ అని ఆరోపణలు గుప్పించారు.
ఎన్నికల వేళ ఖర్గే భారీ హామీ.. ఆ రంగంలో దేశాన్ని టాప్‌లో నిలుపుతామని..
కాంగ్రెస్ హయాంలో దేశం అనేక ఉగ్రదాడుల్ని చూసిందని.. ఉగ్రవాద సంస్థలతో వాళ్లు సమావేశాలు నిర్వహించడాన్ని మన దేశం ఎప్పటికీ మర్చిపోదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 26/11 దాడుల (26/11 Attacks) తర్వాత ఆ ఘటనపై వాళ్లు దర్యాప్తు ప్రారంభించే ధైర్యం చేయలేదని, దాడికి పాల్పడిన ఉగ్రవాదులపై కూడా చర్యలు తీసుకునే సాహసం చేయలేకపోయారని చెప్పారు. అలా చేస్తే.. తమ ఓటు బ్యాంకుపై ప్రభావం పడుతుందని ఇండియా కూటమి నేతలు భావించేవాళ్లని అన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 స్థానాలు దాటుతుందని ఉద్ఘాటించిన ఆయన.. కాంగ్రెస్‌కి 50 సీట్లు కూడా రావని, వారికి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని చెప్పుకొచ్చారు.
Read Latest National News and Telugu News
Updated Date - May 11 , 2024 | 03:10 PM