Ayodhya: నేడు అయోధ్యకి ప్రధాని మోదీ.. అఖిలేష్ టార్గెట్‌గా బీజేపీ ఎన్నికల ప్రచారం
ABN, Publish Date - May 05 , 2024 | 08:35 AM
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ(BJP) స్పీడ్ పెంచింది. వరుస సభలు, ప్రచార ర్యాలీలతో హోరెత్తిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మే 5న ఆయన ఉత్తరప్రదేశ్‌లో(UP) ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
లక్నో: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ(BJP) స్పీడ్ పెంచింది. వరుస సభలు, ప్రచార ర్యాలీలతో హోరెత్తిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మే 5న ఆయన ఉత్తరప్రదేశ్‌లో(UP) ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
సమాజ్‌వాదీ పార్టీ కంచుకోట అయిన ఇటావాలో ఆదివారం జరిగే ర్యాలీలో ప్రధాని ప్రసగించనున్నారు. యూపీలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎస్పీ కంచుకోటలైన మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ప్రచారం కొనసాగుతోంది.
ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబానికి చెందిన అయిదురుగు సభ్యులు లోక్ సభ ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారంటూ మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, సీఎం యోగీ ఆదిత్యనాథ్ సభల్లో ప్రశ్నిస్తున్నారు. ఇవాళ మోదీ మళ్లీ ఇదే అంశంపై అఖిలేష్‌పై విమర్శలు గుప్పించే అవకాశం కనిపిస్తోంది.
బీజేపీ ఎన్నడూ గెలవని ఇటావాలో ఇదివరకే యోగీ ఆదిత్యనాథ్ రెండు ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించారు. ఇటావాలో ర్యాలీ ముగిసిన అనంతరం మధ్యాహ్నం సీతాపూర్‌లో జరిగే రోడ్ షోలో ప్రధాని మాట్లాడతారు. ఆ తర్వాత అయోధ్యకు వెళ్లి రామమందిరంలో పూజలు చేసి.. నగరంలో ప్రచారం నిర్వహిస్తారు.
For Latest News and National News click here
Updated Date - May 05 , 2024 | 09:41 AM