PM Modi: నీటి అడుగులో మెట్రో రైలు.. ప్రయాణించిన ప్రధాని మోదీ
ABN, Publish Date - Mar 06 , 2024 | 11:39 AM
దేశంలో తొలి అండర్ రివర్ మెట్రో రైలును ప్రధాని మోదీ బుధవారం కోల్ కతాలో ప్రారంభించారు. కోల్ కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద హుగ్లీ నది దిగువన రైలు మార్గాన్ని నిర్మించారు. ఇందుకోసం రూ.120 కోట్ల ఖర్చు చేశారు. కోల్ కతా ఈస్ట్ వెస్ట్ మధ్య 16.6 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాన్ని నిర్మించారు. 10.8 కిలోమీటర్లు భూగర్గంలో ఉంది.
కోల్ కతా: దేశంలో తొలి అండర్ రివర్ మెట్రో రైలును ప్రధాని మోదీ (PM Modi) బుధవారం కోల్ కతాలో ప్రారంభించారు. కోల్ కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద హుగ్లీ నది దిగువన రైలు మార్గాన్ని నిర్మించారు. ఇందుకోసం రూ.120 కోట్ల ఖర్చు చేశారు. కోల్ కతా (Kolkata) ఈస్ట్ వెస్ట్ మధ్య 16.6 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాన్ని నిర్మించారు. 10.8 కిలోమీటర్లు భూగర్గంలో ఉంది. హావ్‌డా మైదాన్ నుంచి ఎస్‌ప్లెనెడ్ స్టేషన్ల మధ్య 4.8 కిలోమీటర్ల మేర ఉన్న లైన్‌లో భాగంగా 520 మీటర్ల పొడవు గల అండర్‌వాటర్ మెట్రో టన్నెల్ నిర్మించారు. నదిలో ఈ దూరాన్ని మెట్రో రైలు 45 సెకన్లలో పూర్తి చేస్తుంది. ఈ సొరంగాన్ని నదీ గర్భానికి 16 మీటర్ల లోతులో, భూమి లోపలికి 32 మీటర్ల లోతులో నిర్మించారు. ఈ సొరంగం అంతర్గత వ్యాసం 5.5 మీటర్లుగా.. బాహ్య వ్యాసం 6.1 మీటర్లుగా ఉంది. హావ్‌డా నుంచి సీల్దాకు రోడ్డు మార్గంలో వెళ్లడానికి 90 నిమిషాల సమయం పడుతోంది. అండర్‌వాటర్ మెట్రో మార్గం ఏర్పాటుతో ఈ ప్రయాణ సమయం 40 నిమిషాలకు తగ్గనుంది. అండర్ వాటర్ మెట్రో రైలు నడిచే మార్గంలో మొత్తం ఆరు స్టేషన్లు ఉండగా.. అందులో మూడు భూగర్భంలోనే ఉన్నాయి. అండర్ వాటర్ మెట్రో రైలు ప్రయాణం కోల్‌కతా వాసులకు కొత్త అనుభూతిని కలిగించనుంది. కోల్‌కతాలోని మరిన్ని మెట్రో మార్గాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. హౌరా మైదాన్-ఎస్ల్పానేడ్ మెట్రో మార్గం, కవి సుభాస్-హమంత ముఖోపాధ్యాయ మెట్రో మార్గం, తరటాలా-మజెర్‌హట్ మెట్రో మార్గం, రూబీ హాల్ క్లినిక్- రాంవాడి మెట్రో మార్గం వంటి తదితర మెట్రో లైన్‌లను ప్రధాని మోదీ ప్రారంభించారు.
గత ఐదు రోజుల్లో రెండోసారి ప్రధాని మోదీ కోల్ కతా వచ్చారు. రూ.15,400 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఉత్తర 24 పరగణ జిల్లాలో గల బరాసత్ వద్ద బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. బరాసత్, సందేశ్ ఖాళి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. టీఎంసీ నేత షేక్ షాజహాన్ ఇష్యూకి సంబంధించి బెంగాల్‌లో రగడ నెలకొంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ బరాసత్‌లో ప్రసంగించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 06 , 2024 | 12:02 PM