ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: రాహుల్‌పై పాకిస్తాన్ ప్రశంసలు.. తీవ్రంగా మండిపడ్డ ప్రధాని మోదీ

ABN, Publish Date - May 02 , 2024 | 05:00 PM

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుసేన్ ప్రశంసలు కురిపించడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ యువరాజు అయిన రాహుల్‌ని ‘ప్రధానమంత్రి’ చేసేందుకు..

PM Narendra Modi Fires On Rahul Gandhi

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)పై పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుసేన్ ప్రశంసలు కురిపించడంపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ (COngress) యువరాజు అయిన రాహుల్‌ని ‘ప్రధానమంత్రి’ చేసేందుకు పాకిస్తాన్ తహతహలాడుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ (Pakistan) అభిమాని అని, ఇప్పుడు వారి మధ్య బద్ధం తేటతెల్లమైందని అన్నారు. గుజరాత్‌లోని (Gujarat) ఆనంద్ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా.. మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

AP Elections: ముద్రగడపై పృథ్వీరాజ్ హాట్ కామెంట్స్

‘‘భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ నానాటికీ బలహీనపడుతోంది. ఇక్కడ ఆ పార్టీ తన అస్థిత్వాన్ని కోల్పోతుంటే.. అక్కడ పాకిస్థాన్‌ కన్నీళ్లు పెట్టుకుంటోంది. కాంగ్రెస్‌ యువరాజుని (రాహుల్‌ను ఉద్దేశిస్తూ) భారత ప్రధానమంత్రి చేయాలని ఆ దాయాది దేశం తహతహలాడుతోంది. పాకిస్తాన్‌కు కాంగ్రెస్ పార్టీ అభిమాని అని మనకు ముందు నుంచే తెలుసు. ఇప్పుడు వారి మధ్య ఉన్న బంధం పూర్తిగా బయటపడింది’’ అని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. మన దేశంలో బలహీన ప్రభుత్వం ఉండాలని శత్రువులు కోరుకుంటున్నారని.. 26/11 ముంబయి దాడుల నాటి ప్రభుత్వం, 2014కు ముందున్న సర్కారు మళ్లీ అధికారంలోకి రావాలని వాళ్లు ఆశపడుతున్నారని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ కోస పాక్ నేతలు ప్రార్థిస్తున్నారని దుయ్యబట్టారు.

అందరిలా మాటలు చెప్పడం చేతకాదు.. పనిచేసి చూపిస్తా: సుజనా


60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేయలేని పనిని తాము పదేళ్ల అధికారంలోనే చేసి చూపించామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో దాదాపు 60 శాతం మంది గ్రామీణ ప్రజలకు మరుగుదొడ్ల సదుపాయం లేదని, బీజేపీ పదేళ్లలోనే ఆ పని పూర్తి చేసిందని చెప్పారు. ముస్లింలకు షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) రిజర్వేషన్లు కల్పించేందుకు గాను.. భారత రాజ్యాంగాన్ని మార్చాలని కాంగ్రెస్ భావిస్తోందని ఆరోపించారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగాన్ని మార్చబోమని కాంగ్రెస్ లిఖితపూర్వకంగా ఇస్తుందా? అని ప్రధాని మోదీ సవాల్ విసిరారు. గత పదేళ్లలో బీజేపీ ఎన్నో విజయాలు సాధించిందని చెప్పుకొచ్చారు.

ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై ఎటువంటి సందేహాలు వద్దు..

ఇదిలావుండగా.. పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్‌ హుస్సేన్‌ ఇటీవల తన సోషల్‌ మీడియా ఖాతాలో రాహుల్‌ గురించి ఒక పోస్ట్‌ పెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. బీజేపీ, నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ రాహుల్ గాంధీ ప్రసంగించిన వీడియోని ఆయన షేర్ చేస్తూ.. ‘రాహుల్‌ ఆన్ ఫైర్‌’ అని రాసుకొచ్చారు. ఇదే ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ట్వీట్‌తో పాకిస్తాన్, కాంగ్రెస్‌కి మధ్య స్నేహం ఉందని మరింత స్పష్టమైందని బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది.

Read Latest National News and Telugu News

Updated Date - May 02 , 2024 | 05:00 PM

Advertising
Advertising