PM Modi: ‘కావాలని చేశారు’.. ప్రైవేటైజేషన్‌పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్..!
ABN, First Publish Date - 2024-02-07T16:59:47+05:30
PM Narendra Modi: అసలే ఎన్నికల కాలం.. అందివచ్చిన అవకాశాన్ని ప్రధాని మోదీ వదిలిపెడతారా? ఛాన్సే లేదు. వేదిక ఏదైనా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో చాలా నేర్పరి ప్రధాని నరేంద్ర మోదీ. ఇంకేముంది.. ఈ ప్రభుత్వ కాలంలో చివరి బడ్జెట్ సమావేశాలు కావడంతో పార్లమెంట్ వేదికగా ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేశారు ప్రధాని మోదీ.
ఢిల్లీ, ఫిబ్రవరి 07: అసలే ఎన్నికల కాలం.. అందివచ్చిన అవకాశాన్ని ప్రధాని మోదీ వదిలిపెడతారా? ఛాన్సే లేదు. వేదిక ఏదైనా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ చాలా నేర్పరి. ఇంకేముంది.. ఈ ప్రభుత్వ కాలంలో చివరి బడ్జెట్ సమావేశాలు కావడంతో పార్లమెంట్ వేదికగా ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేశారు. తన వాక్చాతుర్యంతో.. కాంగ్రెస్ పార్టీపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. తమ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు తిప్పికొట్టడమే కాకుండా.. వాటంతటికీ కారణం ఆ పార్టీనే అని ఫైర్ అయ్యారు.
బుధవారం నాడు రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై నెక్ట్స్ లెవెల్‌లో కామెంట్స్ చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసినట్టు.. కాంగ్రెస్ పార్టీ తమపై అసత్యప్రచారం చేసిందన్నారు. తానూ స్వతంత్ర భారతంలో పుట్టానని, తన ఆలోచనలు కూడా స్వతంత్రంగానే ఉంటాయన్నారు మోదీ. బానిసత్వానికి తాను పూర్తిగా వ్యతిరేకం అని స్పష్టం చేశారాయన.
BSNL, HAL, MTNL, ఎయిర్ ఇండియా సంస్థలను కాంగ్రెస్ నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని ప్రధాని ఆరోపించారు. ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో BSNLకు 5G కూడా తీసుకొచ్చామన్నారు. HAL కూడా లాభాల్లో నడుస్తోందన్నారు. LIC మూతపడుతుందని కాంగ్రెస్ పుకార్లు పుట్టించిందని, కానీ, ఇప్పుడు LIC షేర్ ధర రికార్డ్ స్థాయిలో ఉందని లెక్కలతో సహా వివరించారు. ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులు రూ.9 లక్షల కోట్ల నుంచి.. రూ.75 లక్షల కోట్లకు పెంచామని చెప్పారు.
ఆ కంపెనీ స్టార్ట్ అవడం లేదు..
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చురకలంటించారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ పార్టీకి స్టార్టప్‌లాగా యువరాజు రాహుల్ నడిపిస్తున్నారని, అయితే, ఆ కంపెనీ ఎంతకీ స్టార్ట్ అవడం లేదని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు.
Updated Date - 2024-02-07T17:44:19+05:30 IST