ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Narendra Modi: దోచుకున్న డబ్బుల్ని మోదీ రికవరీ చేస్తున్నారు

ABN, Publish Date - May 06 , 2024 | 08:48 PM

జార్ఖండ్‌లోని ఓ హౌస్ కీపర్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిర్వహించిన సోదాల్లో.. లెక్కల్లో చూపని రూ.25 కోట్ల నోట్ల కట్టలు బయటపడిన ఉదంతంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. తనతో పాటు తన ప్రభుత్వం..

జార్ఖండ్‌లోని (Jharkhand) ఓ హౌస్ కీపర్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) నిర్వహించిన సోదాల్లో.. లెక్కల్లో చూపని రూ.25 కోట్ల నోట్ల కట్టలు బయటపడిన ఉదంతంపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) స్పందించారు. తనతో పాటు తన ప్రభుత్వం ప్రజల నుంచి దోచుకున్న డబ్బును రికవరీ చేస్తోందని పేర్కొన్నారు. ఒడిశాలోని నబరంగ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.


‘ఎంత అవసరమైతే అంత’.. రిజర్వేషన్లపై రాహుల్ సంచలన ప్రకటన

‘‘జార్ఖండ్‌లో ఈరోజు భారీ స్థాయిలో నోట్ల కట్టలు బయటపడ్డాయి. దోచుకున్న ఈ డబ్బుని మోదీ అక్కడ రికవరీ చేస్తున్నారు. నేను ఈ దోపిడీని ఆపేందుకు ప్రయత్నిస్తుంటే, కొందరు నన్ను దూషిస్తున్నారు. మీరే చెప్పండి.. మీ డబ్బుని మోదీ ఇలాగే కాపాడాలా? వద్దా?’’ అని మోదీ తన ప్రసంగంలో ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అవినీతిపరుల్ని జైలుకి పంపిస్తోందని పేర్కొన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ప్రస్తావిస్తూ.. అవినీతిని కాంగ్రెస్ సాధారణీకరించిందని ఆయన విమర్శించారు. నలభై ఏళ్ల క్రితం ఒడిశాకు ఓ ప్రధాని వచ్చారని.. ఢిల్లీ నుంచి ఒక్క రూపాయి పంపితే పేదలకు కేవలం 15 పైసలు చేరేదని.. అంటే 100 పైసల్లో 85 పైసలు కాంగ్రెస్‌ దోచుకుందని ఆరోపించారు. కానీ తాను కేంద్రం నుంచి ఒక్క రూపాయి పంపితే ఒక్క పైసా కూడా తిననని, ఎవరైనా ఒక్క పైసా తింటే వాళ్లు జైల్లో చిప్పకూడు తినాల్సిందేనని మోదీ చెప్పుకొచ్చారు.

పెళ్లికి ముందు ఊహించని ట్విస్ట్.. వైద్య పరీక్షల్లో షాకింగ్ రిజల్ట్

ఇదిలావుండగా.. మనీలాండరింగ్ కేసులో (Moneylaundering Case) భాగంగా ఈడీ సోమవారం జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే.. ఒక హౌస్‌కీపర్ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఆ సొమ్ము రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఆ మొత్తాన్ని లెక్కించేందుకు బ్యాంకు అధికారుల్ని రప్పించారని, భద్రత నిమిత్తం పారామిలిటరీ బలగాలను సైతం మోహరించారని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఝార్ఖండ్ మంత్రి అలంఘీర్‌ ఆలం సహాయకుడైన సంజీవ్‌లాల్‌ ఇంట్లో పనిచేసే వ్యక్తి వద్ద ఈ డబ్బు దొరికింది.

Read Latest National News and Telugu News

Updated Date - May 06 , 2024 | 08:48 PM

Advertising
Advertising