PM Narendra Modi: ‘ఇండియా’ కూటమికి ముహూర్తం ఫిక్స్.. ప్రధాని మోదీ వార్నింగ్
ABN, Publish Date - May 07 , 2024 | 05:36 PM
భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్, ఇండియా కూటమిలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ముగిసిందని, ఇండియా కూటమి ఎక్స్‌పైరీ డేట్ ఫిక్స్ అయ్యిందని హెచ్చరించారు. అంతేకాదు.. భారత్‌లో ఉగ్రదాడులకు పాల్పడిన పాకిస్తాన్‌కు..
భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మరోసారి కాంగ్రెస్ (Congress), ఇండియా కూటమిలపై (India Alliance) విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ముగిసిందని, ఇండియా కూటమి ఎక్స్‌పైరీ డేట్ ఫిక్స్ అయ్యిందని హెచ్చరించారు. అంతేకాదు.. భారత్‌లో ఉగ్రదాడులకు పాల్పడిన పాకిస్తాన్‌కు (Pakistan) కాంగ్రెస్ క్లీన్ చిట్ ఇస్తోందని, ఎందరో అమాయకులను బలి తీసుకున్న ఉగ్రవాదులకు నిర్దోషులనే సర్టిఫికెట్ కూడా ఇస్తోందంటూ ఆరోపణలు గుప్పించారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ధోనీ 9వ స్థానంలో రావడానికి కారణమిదే.. విమర్శకులకు కౌంటర్
‘‘సరిహద్దుల్లో కాంగ్రెస్ ‘బీ’ టీమ్ యాక్టివ్‌గా మారింది. ఉగ్రవాద దాడులకు పాల్పడిన పాకిస్థాన్‌కు కాంగ్రెస్ క్లీన్ చిట్ ఇస్తోంది. 26/11 ముంబై (26/11 Mumbai Attacks) దాడుల వెనుక పాకిస్తాన్ ఉన్న విషయం కాదా? మన అమాయక ప్రజలను చంపింది ఎవరు? ఆ దాడుల వెనుక ఎవరున్నారనే విషయం.. మన భారత ప్రజలతో పాటు యావత్ ప్రపంచానికి తెలుసు. ఆ దాడులపై మన కోర్టు తీర్పునిచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ ఉగ్రవాదులకు నిర్దోషి అనే సర్టిఫికేట్ ఇస్తోంది. 26/11 ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు కాంగ్రెస్ నేతలు మద్దతు ఇస్తున్నారు. ఇది ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని అవమానించడమే’’ అని ప్రధాని మోదీ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు.
మోదీ ఇంకా మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కథ దాదాపు కంచికి చేరింది. జూన్ 4వ తేదీతో ఇండియా కూటమి గడువు ముగుస్తుంది’’ అని అన్నారు. ఇండియా కూటమి కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుందని, కానీ తమ బీజేపీ-ఎన్డీయే అభివృద్ధిపై దృష్టి సారించిందని ఆయన నొక్కి చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, జాతీయ భద్రతను హైలైట్ చేస్తూ.. మహారాష్ట్ర పురోగతిని బలోపేతం చేయడానికి బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారు. తమ ఎన్డీఏది అభివృద్ధి మంత్రమని ఉద్ఘాటించారు.
Read Latest National News and Telugu News
Updated Date - May 07 , 2024 | 05:36 PM