ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

12 సార్లు పరీక్ష రాశా.. అందులో ఏడింటిని వదిలేయండి..

ABN, Publish Date - Aug 31 , 2024 | 04:36 AM

తాను 12 సార్లు యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రవేశ పరీక్షలు రాశానని, అందులో ఏడింటిని వదిలేసి మిగిలిన ఐదు పరీక్షలనే పరిగణనలోకి తీసుకోవాలని మాజీ ఐఏఎస్‌ ట్రైనీ పూజా ఖేడ్కర్‌ ఢిల్లీ హైకోర్టును కోరారు.

  • ఢిల్లీ హైకోర్టుకు పూజా ఖేద్కర్‌ అభ్యర్థన

న్యూఢిల్లీ, ఆగస్టు 30: తాను 12 సార్లు యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రవేశ పరీక్షలు రాశానని, అందులో ఏడింటిని వదిలేసి మిగిలిన ఐదు పరీక్షలనే పరిగణనలోకి తీసుకోవాలని మాజీ ఐఏఎస్‌ ట్రైనీ పూజా ఖేడ్కర్‌ ఢిల్లీ హైకోర్టును కోరారు. అలాగే, ఏసీఎల్‌ గాయం వల్ల తన ఎడమ మోకాలు అస్థిరంగా ఉన్నట్టు మహారాష్ట్ర ఆస్పత్రి ఇచ్చిన ధ్రువపత్రం తన వద్ద ఉందని, అందువల్ల దివ్యాంగుల కోటాలో తాను రాసిన పరీక్షలనే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

40% అంగ వైకల్యం ఉన్న వారు దివ్యాంగులని నిబంధనలు చెబుతున్నాయని, తనకు 47% వైకల్యం ఉందని తెలిపారు. ఈ మేరకు న్యాయస్థానంలో శుక్రవారం ఆమె ఓ అఫిడవిట్‌ దాఖలు చేశారు. జనరల్‌ కేటగిరీ అభ్యర్థిగా తాను రాసిన పరీక్షలను గుర్తించవద్దని కోరారు. న్యాయస్థానం ఇందుకు అంగీకరిస్తే తాను రాసిన పరీక్షల సంఖ్య ఐదు(అన్నింటిల్లో ఆమె ఉత్తీర్ణత సాధించారు)కు తగ్గుతుందని పేర్కొన్నారు.

దివ్యాంగ అభ్యర్థులు సివిల్స్‌ రాసేందుకు ఉన్న తొమ్మిది పరిమిత ప్రయత్నాల కంటే ఈ అంకె నాలుగు తక్కువని, జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు ఉన్న అత్యధిక అవకాశాల కంటే ఒకటి తక్కువేనని పూజా అభ్యర్థించారు. ఫోర్జరీ, చీటింగ్‌ కేసుల్లో తన అరెస్టును అడ్డుకోవాలంటూ పూజా కొద్ది రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించారు. కాగా, పూజా ఖేద్కర్‌ 12 సార్లు పరీక్ష రాయగా అందులో ఓసారి పేరును మార్చి బోర్డును మోసగించారంటూ యూపీఎస్సీ చేసిన ఆరోపణను కూడా పూజా ఖండించింది. తాను తన పేరును మార్చలేదని మధ్యలో అటు పదం ఇటు మార్చి చిన్న మార్పు చేశానని సమర్థించుకున్నారు. ఇదిలా ఉండగా, పూజా ఖేద్కర్‌ వివాదం నేపథ్యంలో సివిల్స్‌ అభ్యర్థుల గుర్తింపును ఆధార్‌ ఆధారితంగా ధ్రువీకరించుకోవడానికి యూపీఎస్సీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Updated Date - Aug 31 , 2024 | 04:36 AM

Advertising
Advertising