ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Prajval Revanna Scandal Case: రేవణ్ణ కేసులో ఊహించని ట్విస్ట్.. తనను బెదిరించి ఆరోపణలు చేయించారన్న మహిళ

ABN, Publish Date - May 10 , 2024 | 09:58 AM

కర్ణాటకలో కలకలం రేపిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ(Prajval Revanna) సెక్స్ స్కాండల్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. జాతీయ మహిళా కమిషన్(NWC) గురువారం మాట్లాడుతూ.. ఈ కేసులో ఫిర్యాదు చేసిన మహిళల్లో ఒకరు తనను బెదిరించి రేవణ్ణపై అసత్య ఆరోపణలు చేయించారని తమతో చెప్పినట్లు కమిషన్ తెలిపింది.

Prajwal Revanna

బెంగళూరు: కర్ణాటకలో కలకలం రేపిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ(Prajval Revanna) సెక్స్ స్కాండల్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. జాతీయ మహిళా కమిషన్(NWC) గురువారం మాట్లాడుతూ.. ఈ కేసులో ఫిర్యాదు చేసిన మహిళల్లో ఒకరు తనను బెదిరించి రేవణ్ణపై అసత్య ఆరోపణలు చేయించారని తమతో చెప్పినట్లు కమిషన్ తెలిపింది. పోలీసులకు సమాచారం అందించగా.. నిందితులపై బెదిరింపుల కేసు నమోదు చేశారు.

జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్ డీ కుమార స్వామి మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ తమ పార్టీపై బురదజల్లేందుకు మహిళలతో అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రకటనలు చేయించకుంటే వ్యభిచారం కేసు పెడతామని సిట్ అధికారులు బాధితులను బెదిరిస్తున్నారని ఆయన అన్నారు. "దర్యాప్తు సంస్థల అధికారులు బాధితుల ఇంటి వద్దకు వెళ్లి బెదిరిస్తున్నారు.


సిట్ అధికారులు తప్పుడు వ్యభిచారం కేసులతో బెదిరించడం వాస్తవం కాదా? సిట్ విచారణ ఇలాగే జరుగుతోంది" అని కుమార స్వామి అన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ కుంభకోణాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద సెక్స్ స్కాండల్‌గా అభివర్ణించిన రెవెన్యూ మంత్రి కృష్ణ బైరే గౌడకి కౌంటర్‌గా ఈ వ్యాఖ్యలు చేశారు.

"కిడ్నాప్‌కు గురైన మహిళను ఎక్కడ ఉంచారు? ఆమెను ఎందుకు కోర్టు ముందు హాజరుపరచడం లేదు? బాధితుల ప్రైవేట్ వీడియోలను బయటకి విడుదల చేసే చర్యలను సమర్థిస్తారా" అని కుమారస్వామి.. శ్రీ గౌడను ప్రశ్నించారు. "ప్రజ్వల్ రేవణ్ణను సమర్థించే ప్రశ్నే లేదు. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలి. దోషులెవరైనా శిక్ష పడాలి" అని కుమార స్వామి అన్నారు. కాగా, సిట్ దర్యాప్తు సమర్ధవంతంగా సాగుతోందని హోం శాఖ మంత్రి జి.పరమేశ్వర తెలిపారు. జేడీఎస్ చేస్తున్న ఆరోపణలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుందని ఆయన అన్నారు.

Read Latest News and National News Click Here..

Updated Date - May 10 , 2024 | 10:55 AM

Advertising
Advertising