ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపండి

ABN, Publish Date - Jun 14 , 2024 | 04:09 AM

జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. అక్కడ వరుసగా ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో గురువారం ఆయన జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోభాల్‌, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాల మోహరింపు, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో కూడా మాట్లాడినట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి.

  • పూర్తి బలంతో ఉగ్రవాదులను అణచివేయండి

  • జమ్మూకశ్మీర్‌ పరిస్థితిపై సమీక్షలో మోదీ ఆదేశం

న్యూఢిల్లీ, జూన్‌ 13: జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. అక్కడ వరుసగా ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో గురువారం ఆయన జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోభాల్‌, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాల మోహరింపు, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో కూడా మాట్లాడినట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని మోదీ ఆదేశించినట్లు వెల్లడించాయి. పూర్తిస్థాయి సామర్థ్యాలను వినియోగించుకొని ఉగ్రవాదులను అణచివేయాలని పేర్కొన్నట్లు తెలిపాయి. జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హాతో కూడా ప్రధాని మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. స్థానిక యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను సిన్హా ప్రధానికి వివరించారు. కాగా, రియాసీలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి 50 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక చైనా, పాక్‌ సంయుక్త ప్రకటనలో జమ్మూకశ్మీర్‌పై చేసిన వ్యాఖ్యల పట్ల భారత్‌ గురువారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ స్పష్టం చేశారు.

జీ 7 అతిథులకు ఇటలీ ప్రధాని ‘నమస్తే’!

రోమ్‌, జూన్‌ 13: మన సంస్కృతీ సంప్రదాయాల్లో భాగమైన ‘నమస్కారం’.. ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపైనా కనిపిస్తోంది. జీ7 సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోని.. సమావేశాల్లో పాల్గొనటానికి వస్తున్న దేశాధినేతలను ‘నమస్తే’తో ఆహ్వానించటం విశేషం. జర్మనీ చాన్స్‌లర్‌ ఓలఫ్‌ స్కోల్జ్‌, యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డెర్‌ లెయెన్‌కు నమస్కారం పెట్టి సదస్సుకు సాదరంగా ఆహ్వానిస్తున్న మెలోని ఫొటోలు, వీడియోలు పలువురిని ఆకర్షిస్తున్నాయి. జీ7 సదస్సులో పాల్గొనటానికి ప్రధాని మోదీ గురువారం ఇటలీకి వెళ్లారు.

Updated Date - Jun 14 , 2024 | 04:09 AM

Advertising
Advertising