ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Loksabha Polls: పార్లమెంట్‌కు ప్రియాంక.. ఎక్కడి నుంచి పోటీ అంటే..?

ABN, Publish Date - Jun 07 , 2024 | 10:35 AM

ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడొస్తారా అని కాంగ్రెస్ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. పోటీ చేయాలని చాలా సందర్భాల్లో కోరారు. వివిధ కారణాలతో దూరం అయ్యారు. ఈ సారి మాత్రం లోక్ సభకు ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ వాయనాడుతోపాటు రాయ్ బరేలి నుంచి కూడా బరిలోకి దిగారు. రెండు చోట్ల గెలవడంతో ఒక స్థానానికి రాజీనామా చేస్తారు. రాజీమా చేసే స్థానం వాయనాడు అని కాంగ్రెస్ వర్గాలు సూత్రప్రాయంగా వెల్లడించాయి.

priyanka gandhi

ఢిల్లీ: ప్రియాంక గాంధీ (priyanka gandhi) ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడొస్తారా అని కాంగ్రెస్ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. పోటీ చేయాలని చాలా సందర్భాల్లో కోరారు. వివిధ కారణాలతో దూరం అయ్యారు. ఈ సారి మాత్రం లోక్ సభకు ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ వాయనాడుతోపాటు రాయ్ బరేలి నుంచి కూడా బరిలోకి దిగారు. రెండు చోట్ల గెలవడంతో ఒక స్థానానికి రాజీనామా చేస్తారు. రాజీమా చేసే స్థానం వాయనాడు అని కాంగ్రెస్ వర్గాలు సూత్రప్రాయంగా వెల్లడించాయి.


వాయనాడు ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ విషయంపై కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. లోక్ సభ ఎన్నికల్లో ప్రియాంక అన్నీ తానై వ్యవహరించారు. సోదరుడు రాహుల్ గాంధీతో జోరుగా ప్రచారం నిర్వహించారు. అమేథి, రాయ్ బరేలి, వాయనాడులో ఉధృతంగా ప్రచారం చేశారు. గత ఎన్నికల కన్నా కాంగ్రెస్ పార్టీ సీట్లు పెరగడంలో ప్రియాంక గాంధీ ముఖ్య పాత్ర పోషించారు.


పరిస్థితులు అనుకూలించి వాయనాడు నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసి, గెలిస్తే కాంగ్రెస్ పార్టీ సీట్లు 100కు చేరుకుంటాయి. పదేళ్ల తర్వాత ఆ పార్టీ సీట్ల సంఖ్య మూడంకెలకు చేరబోతుంది. చూడాలి మరి ఏం జరగనుందో.

Updated Date - Jun 07 , 2024 | 10:37 AM

Advertising
Advertising