Rahul Gandhi: ఆ పని చేస్తే మళ్లీ మోదీ క్షమాపణలు చెప్పాల్సి వస్తుంది
ABN, Publish Date - Sep 25 , 2024 | 08:05 PM
సాగు చట్టాల రద్దు కోరుతూ 700 మంది రైతులు, ముఖ్యంగా పంజాబ్, హర్యానా రైతులు బలిదానాలు చేసినా బీజేపీ నేతలు సంతృప్తి చెందినట్టుగా లేరని రాహుల్ గాంధీ విమర్శించారు. అన్నదాతలకు వ్యతిరేకంగా ఎలాంటి కుట్రలు చేసినా 'ఇండియా' కూటమి అడ్డుకుంటుందన్నారు.
న్యూఢిల్లీ: రద్దయిన సాగుచట్టాల (Farma Laws) వ్యవహారంపై నటి, పార్లమెంటు సభ్యురాలు కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మరోసారి మండిపడింది. 2021లో రద్దయిన మూడు సాగుచట్టాలను వెనక్కి తేవాలంటూ కంగన చేసిన వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వివరణ ఇవ్వాలని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాలను నిర్ణయించేంది ఎవరు? బీజేపీ ఎంపీనా, ప్రధాన మంత్రి మోదీనా? అని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రశ్నించారు.
సాగు చట్టాల రద్దు కోరుతూ 700 మంది రైతులు, ముఖ్యంగా పంజాబ్, హర్యానా రైతులు బలిదానాలు చేసినా బీజేపీ నేతలు సంతృప్తి చెందినట్టుగా లేరని రాహుల్ విమర్శించారు. అన్నదాతలకు వ్యతిరేకంగా ఎలాంటి కుట్రలు చేసినా వారి పాచికలు పారవని, 'ఇండియా' కూటమి అడ్డుకుంటుందని చెప్పారు. రైతులకు హానిచేసే ఎలాంటి చర్యలకు దిగినా ప్రధానమంత్రి మోదీ మరోసారి క్షమాపణలు చెప్పాల్సి ఉంటుందని రాహుల్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Haryana Assembly Elections: ఫిర్ ఏక్ బార్ బీజేపీ సర్కార్... జనం నాడి ఇదేనన్న మోదీ
రైతు వ్యతిరేక మైండ్‌సెట్: ఖర్గే
రైతు వ్యతిరేక భావజాలం ఉన్న బీజేపీకి హర్యానా ఎన్నికల్లో ప్రజలే గట్టిగుణపాఠం చెబుతారని మరో ట్వీట్‌లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. 750 మంది రైతులు బలిదానాలు చేసినా తమ నేరానికి బీజేపీకి కానీ, మోదీ ప్రభుత్వానికి కానీ పశ్చాత్తాపం లేదన్నారు. రద్దయిన రైతు చట్టాలను తిరిగి అమలు చేసే ఎలాంటి చర్యలనైనా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. రైతులను ట్రాక్టర్‌కు కింద తొక్కించడం, ముళ్ల తీగలు, టియర్ గ్యాస్ నుంచి డ్రోన్‌లు, మేకులు, తుపాకులు వరకూ వారిపై ప్రయోగించడాన్ని 62 కోట్ల మంది రైతులు మరచిపోరని, రైతులను ఆందోళనాజీవులని, పరాన్నజీవులని పార్లమెంటులో అవమానించిన వారికి హర్యానా సహా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లోని ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారని అన్నారు.
Read More National News and Latest Telugu News
Also Read: Jammu and Kashmir Assembly Elections: కొనసాగుతున్న రెండో విడత పోలింగ్
Updated Date - Sep 25 , 2024 | 08:05 PM