ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rains: మళ్ళీ అల్పపీడనం.. మరో 5 రోజులు వర్షసూచన

ABN, Publish Date - Dec 24 , 2024 | 10:15 AM

బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఆంధ్రా కోస్తాతీరంవైపు మళ్ళిన బలమైన అల్పపీడనం తన దిశ మార్చుకుని చెన్నై(Chennai) వైపు కదలుతోందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం అల్పపీడనం మధ్య, పడమటి, నైరుతి దిశగా కదులుతోందని, దాని ప్రభావంతో మరో ఐదు రోజులపాటు రాష్ట్రంలో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్నారు.

చెన్నై: బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఆంధ్రా కోస్తాతీరంవైపు మళ్ళిన బలమైన అల్పపీడనం తన దిశ మార్చుకుని చెన్నై(Chennai) వైపు కదలుతోందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం అల్పపీడనం మధ్య, పడమటి, నైరుతి దిశగా కదులుతోందని, దాని ప్రభావంతో మరో ఐదు రోజులపాటు రాష్ట్రంలో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: జైలులో పరిచయం.. బయటకు వచ్చి దందా


మంగళవారం ఉదయం ఆ అల్పపీడనం రాష్ట్రం వైపు కదలి, ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్ర నడుమ తీరానికి చేరువగా, చెన్నై నగరానికి తూర్పు బంగాళాఖాతంలో బలహీనపడుతుందని తెలిపారు. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో విల్లుపురం, కడలూరు, చెంగల్పట్టు(Villupuram, Cuddalore, Chengalpattu) జిల్లాల్లో పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో భారీగా, ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని వివరించారు.


నగరానికి సంబంధించినంతవరకు మంగళ, బుధవారాల్లో ఆకాశం మేఘావృతమై, ఉదయం వేళల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని, దట్టంగా మంచుకురిసే అవకాశం కూడా ఉందని తెలిపారు. దిశమారిన ఈ అల్పపీడనం కారణంగా చెన్నై, కడలూరు, నాగపట్టినం, ఎన్నూరు, కాట్టుపల్లి, పుదుచ్చేరి, కారైక్కాల్‌ ఓడరేవుల్లో మూడో నెంబర్‌ తుఫాను సూచికలను ఎగురవేసినట్లు తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: Revanth Reddy: సంక్రాంతికి వస్తున్నాం!

ఈవార్తను కూడా చదవండి: మహిళా గ్రూపులతో 231 ఎకరాల్లో సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయించండి: సీఎస్‌

ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: విచారణకు రండి..

ఈవార్తను కూడా చదవండి: Cybercrime: బరితెగించిన సైబర్‌ నేరగాళ్లు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 24 , 2024 | 10:17 AM