Rains: డెల్టా జిల్లాల దిశగా అల్పపీడనం.. రేపు, ఎల్లుండి భారీ వర్షసూచన
ABN, Publish Date - Dec 25 , 2024 | 10:06 AM
బంగాళాఖాతంలో ఆంధ్రా కోస్తాతీరం దిశగా వెళ్ళి, తీరం దాటకుండా రాష్ట్రం వైపు మళ్ళిన అల్పపీడనం ప్రస్తుతం డెల్టాజిల్లాల వైపు కదులుతున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఆదివారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం పశ్చిమ నైరుతి దిశగా పయనించి సోమవారం మధ్యాహ్నానికి బంగాళాఖాతంలో ప్రవేశించి రాష్ట్రంలోని ఉత్తర జిల్లాల దిశగా కదిలింది.
చెన్నై: బంగాళాఖాతంలో ఆంధ్రా కోస్తాతీరం దిశగా వెళ్ళి, తీరం దాటకుండా రాష్ట్రం వైపు మళ్ళిన అల్పపీడనం ప్రస్తుతం డెల్టాజిల్లాల వైపు కదులుతున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఆదివారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం పశ్చిమ నైరుతి దిశగా పయనించి సోమవారం మధ్యాహ్నానికి బంగాళాఖాతంలో ప్రవేశించి రాష్ట్రంలోని ఉత్తర జిల్లాల దిశగా కదిలింది. మంగళవారం మధ్యాహ్నం ఆ అల్పపీడనం పశ్చిమ నైరుతి దిశగా పయనించి డెల్టా జిల్లాల వైపు పయనిస్తోంది.
ఈ వార్తను కూడా చదవండి: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు
నగరానికి 500 కి.మీ.ల దూరంలో ఉన్న తీవ్ర అల్పపీడనం బుధవారం తీరానికి చేరువగా రానుంది. గురువారం డెల్టా జిల్లాల్లో తీరం దాటి బలహీనపడి అరేబియా సముద్రం(Arabian Sea) వైపు వెళ్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ తీవ్ర అల్పపీడనం ప్రభావంతో నగరం సహా, పరిసర జిల్లాల్లో మంగళవారం ఉదయం చెదురుమదురుగా వర్షాలు కురిశాయి.
ఈ నెల 26, 27 తేదీల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీగా, ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఈ నెల 28న పడమటి కనుమల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు తెలిపారు. తీవ్ర అల్పపీడన ప్రభావం వల్ల చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, కాంచీపురం(Chengalpattu, Kanchipuram) సహా సముద్రతీర జిల్లాల్లో చెదురుముదురుగా వర్షాలు కురుస్తాయన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: తప్పయిపోయింది!
ఈవార్తను కూడా చదవండి: Ponguleti: తప్పు జరిగితే.. వేటు తప్పదు!
ఈవార్తను కూడా చదవండి: నేడు, రేపు మోస్తరు వర్షాలు
ఈవార్తను కూడా చదవండి: రుణమాఫీ చేసి తీరుతాం.. ఏ ఒక్క రైతు అధైర్యపడొద్దు
Read Latest Telangana News and National News
Updated Date - Dec 25 , 2024 | 10:06 AM