ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BJP: అఖిలేశ్‌కు రాజా భయ్యా షాక్.. బీజేపీకి మద్దతు ఇస్తానని ప్రకటన

ABN, Publish Date - Feb 26 , 2024 | 04:41 PM

సమాజ్‌‌వాదీ పార్టీకి జనసత్తా దళ్ (లోక్ తాంత్రిక్) పార్టీ షాక్ ఇచ్చింది. ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తానని ప్రకటించింది.

లక్నో: సమాజ్‌‌వాదీ పార్టీకి (SP) జనసత్తా దళ్ (లోక్ తాంత్రిక్) పార్టీ షాక్ ఇచ్చింది. ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి (BJP) మద్దతు ఇస్తానని ప్రకటించింది. తమకు మద్దతు ఇవ్వాలని జనసత్తా దళ్ అధినేత రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యాను ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ కోరారు. సపోర్ట్ చేయాలని రాజా భయ్యాను బీజేపీ కోరింది. ఎన్డీఏ లేజిస్లేటర్ల సమావేశానికి రాజా భయ్యా హాజరయ్యారు. మంగళవారం జరిగే రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని తమ పార్టీ ఎమ్మెల్యేకు సూచించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో జనసత్తా దళ్ పార్టీకి రెండు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో ఒక సీటు రాజా భయ్యా గెలుపొందారు.

ఉత్తరప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు మంగళవారం జరగనున్నాయి. ఒకరోజు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. సోమవారం (ఈ రోజు) సాయంత్రం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో రాజా భయ్యా సమావేశం అవుతారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ నరేష్ ఉత్తమ్ రాజా భయ్యాను కలిశారని తెలిసింది. లోక్ సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న రాజ్యసభ ఎన్నికలను అన్ని పార్టీలు కీలకంగా భావిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఏడు, ఎస్పీకి ముగ్గురు రాజ్యసభ సభ్యులు గెలిచే మద్దతు ఉంది. ఎనిమిదో సీటు కోసం రేపు ఎన్నిక జరగనుంది. బీజేపీ నుంచి సంజయ్ సేతు బరిలో ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 26 , 2024 | 04:41 PM

Advertising
Advertising