ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Modi 3.0 Cabinet: మోదీ కేబినెట్‌లో అత్యంత పిన్న వయస్కుడు.. ఏపీకి దక్కిన అరుదైన అవకాశం

ABN, Publish Date - Jun 09 , 2024 | 08:27 PM

ఢిల్లీలో ప్రధాని మోదీ(PM Modi) నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ప్రమాణ స్వీకార మహోత్సవం ఉల్లాసంగా జరిగింది. ఈ సారి మంత్రి వర్గంలో అందరి చూపు ఒకరిపై ఉంది. ఆయన మరెవరో కాదు ఏపీ నుంచి టీడీపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కింజారపు రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu Kinjarapu).

ఢిల్లీ: ఢిల్లీలో ప్రధాని మోదీ(PM Modi) నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ప్రమాణ స్వీకార మహోత్సవం ఉల్లాసంగా జరిగింది. ఈ సారి మంత్రి వర్గంలో అందరి చూపు ఒకరిపై ఉంది. ఆయన మరెవరో కాదు ఏపీ నుంచి టీడీపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కింజారపు రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu Kinjarapu). మోదీ కేబినెట్‌లో అత్యంత పిన్న వయస్కుడు(తక్కువ వయసు) రామ్మోహనే కావడం విశేషం. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికైన రామ్మోహన్ వయసు 36 సంవత్సరాలే.

దీంతో అతి చిన్న వయసులో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు రామ్మోహన్. ఆయన 26 ఏళ్లకే తొలిసారి ఎంపీగా గెలుపొందారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఆయనతోపాటు టీడీపీ నుంచి మరో ఎంపీ చంద్రశేఖర్ పెమ్మసానిని కూడా మంత్రి పదవి వరించింది. పెమ్మసాని గుంటూరు ఎంపీగా తొలిసారి గెలుపొందారు. తొలి గెలుపుతోనే నేరుగా కేంద్ర మంత్రి పదవి చేపట్టడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.


రామ్మోహన్ గురించి..

కేంద్ర మాజీ మంత్రి, దివంగత ఎర్రన్నాయుడి కుమారుడిగా రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన వయసు 36 ఏళ్లు. ఎర్రన్నాయుడు 2012లో రోడ్డు ప్రమాదంలో మరణించడంతో రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు 2014, 2019, 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి మూడుసార్లు గెలిచారు. రామ్మోహన్ ఆర్కేపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్య పూర్తి చేశారు.

ఆపై ప్రఖ్యాత పర్డ్యూ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. ఆ తరువాత MBAలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని అభ్యసించారు. తండ్రిలాగే రామ్మోహన్ కూడా టీడీపీ అధినేత, ఏపీ కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. గతంలోనూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఎంపీగా అసాధారణ పనితీరు కనబరిచినందుకు రామ్మోహన్‌కు 2020లో సంసద్ రత్న అవార్డుతో సత్కరించారు

Read more!

Updated Date - Jun 09 , 2024 | 08:28 PM

Advertising
Advertising