ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hemant Soren: మనీ లాండరింగ్ కేసు.. మాజీ సీఎం జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

ABN, Publish Date - Mar 22 , 2024 | 09:24 AM

భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జ్యుడీషియల్ కస్టడీని పెంచుతూ రాంచీలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జ్యుడీషియల్ కస్టడీని పెంచుతూ రాంచీలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మార్చి 21 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సోరెన్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద సోరెన్‌ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి మార్చి మూడో వారంలో విచారణ చేపట్టాలని కోరతూ రాంచీ పోలీసులు ఈడీ ( ED ) అధికారులకు నోటీసులు ఇచ్చారు.

తన పరువుకు భంగం కలిగించేలా తన నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించిందని సోరెన్ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. గిరిజనుడైన తనను వేధిస్తున్నారని, చెడ్డపేరు తెచ్చారని ఈడీ అధికారులపై ఆరోపించారు. సోరెన్ ఫిర్యాదుపై జార్ఖండ్ పోలీసులు జనవరి 31న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫిబ్రవరి 29న జార్ఖండ్ శాసనసభ బడ్జెట్ సమావేశానికి హాజరయ్యేందుకు అనుమతి కోరుతూ హేమంత్ వేసిన పిటిషన్‌ను జార్ఖండ్ హైకోర్టు కొట్టివేసింది.


భూ కుంభకోణం కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో సోరెన్‌ను జనవరి 31న అరెస్టు చేశారు. 8.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూములు మాజీ సీఎం సంపాదించిన నేరారోపణలో భాగమని ఏజెన్సీ అభియోగాలు మోపింది. దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టి అరెస్టు చేసింది. అరెస్టుతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. హేమంత్ సోరెన్ స్థానంలో ఆయన భార్య సీఎం బాధ్యతను స్వీకరిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ... చివరకు చంపై సోరెన్ ను ఎంపిక చేశారు.

Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు.. నేడు సుప్రీంకోర్టులో విచారణ..!

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 22 , 2024 | 09:24 AM

Advertising
Advertising