RBI: ఆర్బీఐ కార్యాలయానికి బాంబు బెదిరింపు..
ABN, Publish Date - Dec 13 , 2024 | 12:08 PM
వివిధ శాఖలకు సంబంధించిన ఆఫీసులకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం ఇటీవల సర్వసాధారణమైంది. తాజాగా, ఆర్బీఐ కార్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడం అందరినీ ఆందోలనకు గురి చేస్తోంది. ముంబైలో ఉన్న ఆర్బీఐ కార్యాలయాన్ని బాంబులతో పేల్చేస్తామని కొందరు గుర్తు తెలియని అగంతకులు మెయిల్ చేశారు.
వివిధ శాఖలకు సంబంధించిన ఆఫీసులకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం ఇటీవల సర్వసాధారణమైంది. తాజాగా, ఆర్బీఐ కార్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడం అందరినీ ఆందోలనకు గురి చేస్తోంది. ముంబైలో ఉన్న ఆర్బీఐ కార్యాలయాన్ని బాంబులతో పేల్చేస్తామని కొందరు గుర్తు తెలియని అగంతకులు మెయిల్ చేశారు. ఈ మెయిల్ ఆర్బీఐ గవర్నర్ ఈ-మెయిల్‌కు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ముంబైలోని ఆర్బీఐ ఆర్బీఐ కార్యాలయానికి శుక్రవారం ఓ మెయిల్ వచ్చింది. ‘‘ఆర్బీఐ కార్యాలయాన్ని బాంబులతో పేల్చేస్తాం’’.. ఇది ఆ మెయిల్ సారాంశం. అది కూడా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ-మెయిల్‌కు రావడంతో సంచలనం కలిగిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అలెర్ట్ అయ్యారు. ఆర్బీఐ కార్యాయానికి చేరుకున్న బాంబ్, డాంగ్ స్క్వాడ్ బృందాలు క్షణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. ఈ మెయిల్ రష్యన్ భాషలో వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఏకంగా ఆర్బీఐ గవర్నర్‌కే మెయిల్ చేయడంతో పోలీసులు దీన్ని సీరియస్‌గా తీసుకుని, వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా, ఆర్బీఐ కార్యాలయానికే కాకుండా ఢిల్లీలోని స్కూళ్లను పేల్చేస్తామంటూ కూడా గుర్తు తెలియని వారి నుంచి బెదిరింపులు వచ్చినట్లు తెలిసింది. దీనిపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు.
Updated Date - Dec 13 , 2024 | 12:08 PM