ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ayodhya: బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి అయోధ్యకు ఆర్జేడీ, బీఎస్పీ సభ్యులు

ABN, Publish Date - Feb 11 , 2024 | 01:22 PM

ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యేలు ఆదివారం నాడు అయోధ్య బాల రాముడిని దర్శించుకున్నారు. ఉదయం లక్నో నుంచి బస్సుల్లో అయోధ్యకు బయలుదేరారు. స్టార్ట్ అయ్యే ముందు జై శ్రీరామ్ అని గట్టిగా నినాదాలు చేశారు.

అయోధ్య: అయోధ్య ఆలయంలో బాల రాముడు విశేష పూజలు అందుకుంటున్నారు. రాములోరిని వేలాది మంది భక్తులు దర్శించుకొని తరిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యేలు (Uttar Pradesh MLA) ఆదివారం రోజున దర్శించుకున్నారు. ఉదయం లక్నో నుంచి బస్సుల్లో అయోధ్యకు బయలుదేరారు. స్టార్ట్ అయ్యే ముందు జై శ్రీరామ్ అని బీజేపీ ఎమ్మెల్యేలు గట్టిగా నినాదాలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలతో రాష్ట్రీయ్ లోక్ దళ్, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.

ఆర్‌ఎల్‌డీ ఇండియా కూటమిలో చేరనుందనే ఊహాగానాలు వినిపించాయి. ఆర్ఎల్‌డీ ఎమ్మెల్యేలు బీజేపీ సభ్యులతో కలిసి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. సమాజ్ వాదీ పార్టీ, ఆర్ఎల్‌డీ మధ్య విభేదాలు వచ్చాయని తెలిసింది. ఆ క్రమంలో ఎస్పీ కామ్‌గా ఉండిపోయింది. ఆర్ఎల్‌డీ మాత్రం బీజేపీ సభ్యులతో కలిసి అయోధ్యకు వచ్చింది.

అయోధ్య రాములోరి దర్శనం కోసం రావాలని ఉత్తర ప్రదేశ్ స్పీకర్ అన్ని రాజకీయ పార్టీలను కోరారు. అందుకు ఆర్ఎల్‌డీ సమ్మతించింది. స్పీకర్ విజ్ఞప్తిని ఎస్పీ తోసిపుచ్చింది. బీఎస్పీ కూడా ఆహ్వానాన్ని స్వీకరించింది. ఎస్పీ నేతలు కావాలనే రాజకీయం చేస్తున్నారని బీఎస్పీ మండిపడింది. తమ పార్టీ అన్ని మతాలను గౌరవిస్తుందని స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 11 , 2024 | 01:22 PM

Advertising
Advertising