ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi Liquor Scam: దిల్లీ మద్యం కేసు.. మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు..

ABN, Publish Date - Apr 06 , 2024 | 04:59 PM

దిల్లీ మద్యం కేసులో అరెస్టైన దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ ( AAP ) నేత మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని మరో 12 రోజులు పొడిగించారు.

దిల్లీ మద్యం కేసులో అరెస్టైన దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ ( AAP ) నేత మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని మరో 12 రోజులు పొడిగించారు. ఏప్రిల్ 18 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని రూస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం పాలసీ కేసులో తీహార్ జైలులో ఉన్న సిసోడియా కస్టడీ నేటితో ముగియనుండడంతో ఆయనను కోర్టులో హాజరుపరిచారు.

Trending: స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి భూకంపం ఎఫెక్ట్.. కంపించిన దృశ్యాలు మీరు చూశారా..


మనీష్ సిసోడియా 2023 ఫిబ్రవరి 26 నుంచి తీహార్ జైలులో ఉన్నారు. మద్యం వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చేలా ఎక్సైజ్ పాలసీని మార్చారని సీబీఐ, ఈడీ అభియోగాలు మోపాయి. ఆప్ నేతలు భారీ మొత్తంలో లంచం అందుకున్నారని ఆరోపించాయి. ఈ క్రమంలో మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 2వ తేదీన విచారణ జరిగిన సమయంలో విచారణ పూర్తయినందున తనను జైలులో ఉంచడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.


Kejriwal: కేజ్రీవాల్ కు బిగ్ రిలీఫ్.. ఎఫ్ఐఆర్ ను తిరస్కరించిన కోర్టు..

కొద్ది రోజుల క్రితం తన అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు ఒక లేఖ రాశారు. తన పరిస్థితిని స్వాతంత్ర్య సమరయోధులపై బ్రిటిష్ వారు చేసిన దురాగతాలతో పోల్చారు. త్వరలోనే బయటకు వస్తానని, అందరినీ కలుస్తానని అన్నారు. తాను ప్రతి ఒక్కరినీ చాలా మిస్ అయ్యానని, అందరూ ఎంతో నిజాయితీతో కలిసి పనిచేశారని మనీష్ సిసోడియా కొనియాడారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 06 , 2024 | 04:59 PM

Advertising
Advertising