ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bihar: రష్యా సైన్యానికి హజీపూర్ బూట్లు.. పెరుగుతున్న డిమాండ్

ABN, Publish Date - Jul 15 , 2024 | 05:44 PM

రష్యా- ఉక్రెయిన్ మధ్య చాలా కాలంలో భీకర యుద్దం కొనసాగుతుంది. అలాంటి రష్యాలో ఆ దేశ సైనికులు వేసుకునే బూట్లు భారత్‌లో తయారవుతాయన్న సంగతి అతి కొద్ది మందికే మాత్రమే తెలుసు.

వైశాలి, జులై 15: రష్యా- ఉక్రెయిన్ మధ్య చాలా కాలంలో భీకర యుద్దం కొనసాగుతుంది. అలాంటి రష్యాలో ఆ దేశ సైనికులు వేసుకునే బూట్లు భారత్‌లో తయారవుతాయన్న సంగతి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. రష్యా సైనికులు ధరించే ఈ బూట్లు బిహార్‌లోని హజీపూర్‌లో తయారవుతున్నాయి. అసలు అయితే హజీపూర్ నగరం.. వ్యవసాయ ఉత్పత్తులకు ప్రసిద్ది. అలాంటి నగరం రష్యా సైనికులకు బూట్ల తయారు చేయడం ద్వారా ఈ హజీపూర్ అంతర్జాతీయ ఖ్యాతీని పొందింది.

హజీపూర్‌లోని కాంపిటెన్స్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థ జనరల్ మేనేజర్ సాహిబ్ కుమార్ రాయ్ మాట్లాడుతూ.. 2018లో ఈ సంస్థ ద్వారా బూట్ల తయారీ ప్రారంభించామని తెలిపారు. స్థానికులకు ఉద్యోగాల కల్పన కోసం ముఖ్యంగా ఈ సంస్థను ఏర్పాటు చేశామన్నారు. తొలుత ఈ బూట్లను రష్యాకు ఎగుమతి చేశామని తెలిపారు. ఈ బూట్లను ఆ దేశ వాతావరణానికి అనుగుణంగా తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. - 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను సైతం ఈ బూట్లు తట్టుకుంటాయని చెప్పారు.

Also Read: Pune Police: పరారీలో పూజా ఖేద్కర్ తల్లిదండ్రులు


ఇక ఈ బూట్ల బరువు స్వల్పంగా ఉంటాయన్నారు. వీటిని ధరించడం వల్ల జారీ పడే అవకాశం ఉండదన్నారు. ఈ బూట్లకు వాడే సోల్ సైతం ప్రత్యేకత కలిగి ఉంటుందన్నారు. ఈ బూట్లకు రష్యాలో మంచి స్పందన లభిస్తుందని తెలిపారు. రష్యాకు అత్యధికంగా బూట్లను ఎగుమతి చేస్తున్న సంస్థల్లో కాంపిటెన్స్ ఎక్స్‌పోర్ట్స్ ఒకటని సాహిబ్ కుమార్ స్పష్టం చేశారు.

Also Read: Iskcon: డోనాల్డ్ ట్రంప్‌ను జగన్నాథుడే కాపాడాడు

కాంపిటెన్స్ ఎక్స్‌పోర్ట్స్.. బిహార్‌లో ప్రపంచ స్థాయి సంస్థగా ఖ్యాతి కెక్కిందన్నారు. తమ సంస్థలో 300 మంది ఉద్యోగులు ఉంటే.. వారిలో 70 శాతం మంది మహిళలే ఉన్నారని తెలిపారు. గతేడాది రూ.100 కోట్ల విలువైన 1.5 మిలియన్ల జతల బూట్లను ఎగుమతి చేశామన్నారు. వచ్చే ఏడాది దీనిని 50 శాతం మేర పెంచే ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు.

Also Read: Arvind Kejriwal: ఆరోగ్యంపై స్పందించిన తీహాడ్.. తొసిపుచ్చిన ఆప్

రాష్ట్రంలో పరిశ్రమలకు బిహార్ ప్రభుత్వం ప్రచారంతోపాటు సహాయ సహకారాలు అందించాలని ఆయన ఆకాంక్షించారు. ఆ క్రమంలో మరిన్ని మౌలిక సదుపాయాలు రహదారులతోపాటు సమాచార వ్యవస్థను మెరుగు పరిస్తే.. రష్యాలోని వ్యాపారస్తులు హజీపూర్ వైపు దృష్టి సారిస్తారని సాహిబ్ కుమార్ తెలిపారు.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 15 , 2024 | 05:45 PM

Advertising
Advertising
<