Share News

Highest Paid Item Girl: అత్యధిక పారితోషికం తీసుకున్న ఐటెం-గర్ల్.. స్టార్ హీరోయిన్లకు మించి!

ABN , Publish Date - Jan 04 , 2024 | 03:23 PM

మన ఇండియన్ సినిమాలో ‘ఐటెం సాంగ్స్’ అనేవి దాదాపు టాకీ వర్షన్ మొదలైనప్పటి నుంచి భాగమయ్యాయి. ఈ పాటలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణ తీసుకురావడంతో పాటు ప్రమోషనల్ స్ట్రాటజీలలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా..

Highest Paid Item Girl: అత్యధిక పారితోషికం తీసుకున్న ఐటెం-గర్ల్.. స్టార్ హీరోయిన్లకు మించి!

Highest Paid Item Girl: మన ఇండియన్ సినిమాలో ‘ఐటెం సాంగ్స్’ అనేవి దాదాపు టాకీ వర్షన్ మొదలైనప్పటి నుంచి భాగమయ్యాయి. ఈ పాటలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణ తీసుకురావడంతో పాటు ప్రమోషనల్ స్ట్రాటజీలలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా.. మాస్ ఆడియెన్స్‌ని ఈ పాటలు ఆకర్షిస్తాయి. అందుకే.. కమర్షియల్ సినిమాల్లో ఏరికోరి మరీ ఒక ఐటెం సాంగ్‌ని పెడతారు. అందునా.. స్టార్ హీరోల చిత్రాల్లో తప్పకుండా ప్రత్యేక గీతం ఉండేలా ప్రణాళికలు రచిస్తారు. అంతేకాదు.. భారీ పారితోషికాలు ఇచ్చి మరీ స్టార్ నటీమణుల్ని స్పెషల్ సాంగ్స్ కోసం తీసుకుంటున్నారు. అటు.. కథానాయికలు కూడా మార్కెట్‌లో ఈ పాటలకున్న డిమాండ్ దృష్ట్యా, ఐటెం సాంగ్స్ చేసేందుకు ముందుకొస్తున్నారు.


అలాంటి కథానాయికల జాబితాలో టాలీవుడ్ అగ్రనటి సమంత కూడా చేరిపోయింది. పుష్ప: ద రైజ్ సినిమాలో ఈ అందాల తార ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా’ అనే పాటలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి ఆడిపాడింది. ఈ పాటలో మునుపెన్నడూ లేని విధంగా తన అందాల్ని కూడా ఆరబోసింది. తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు సమంత ఇలా ఒక ఐటెం సాంగ్‌లో నటించడంతో.. కచ్ఛితంగా భారీ పారితోషికమే అందుకుని ఉంటుందని అందరూ ఊహించారు. ఆ ఊహాగానాలకు తగినట్టుగానే.. ఆ పాటకి గాను సమంత అక్షరాల రూ.5 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్టు ఆ తర్వాతి కాలంలో వెల్లడైంది. దీంతో.. ఒక స్పెషల్ సాంగ్ కోసం అత్యధిక పారితోషికం తీసుకున్న కథానాయికగా సమంత చరిత్రపుటలకెక్కింది. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఒక ఐటెం సాంగ్‌కి ఇంత అమౌంట్‌ని ఇప్పటివరకూ ఏ ఒక్కరూ కూడా అందుకోలేదు.

స్పెషల్ సాంగ్స్ చేయడంలో తమదైన ప్రత్యేక ముద్ర వేసిన నోరా ఫతేహి, మలైకా అరోరా ఖాన్‌లు సైతం తక్కువ పారితోషికమే తీసుకుంటున్నారు. రిపోర్ట్స్ ప్రకారం.. నోరా ఫతేహి రూ.2 కోట్లు, మలైకా రూ.1.50 కోట్లు అందుకుంటారని తెలిసింది. బాలీవుడ్ స్టార్ నటీమణుల్లో ఒకరిగా స్థానం సంపాదించిన కత్రినా కైఫ్ అయితే ఒక్కో పాటకు రూ.2 కోట్లు పుచ్చుకుంటోంది. ఇక జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రూ.3 కోట్లు తీసుకుంటుండగా.. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా రూ. 1 కోటి మాత్రమే అందుకుంటోంది. నేషనల్ క్రష్‌గా పేరుగాంచిన రష్మిక మందన్న అయితే పూర్తి సినిమాకే రూ.2 కోట్లు చార్జ్ చేస్తోందని సమాచారం. దీన్ని బట్టి.. ఇండస్ట్రీలో సమంతకి ఎంత క్రేజ్ ఉందో, ఆమె స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒక్క పాటకే రూ.5 కోట్లు తీసుకుందంటే, ఇక సినిమా మొత్తానికి సమంత ఎంత ఛార్జ్ చేస్తోందో..?

Updated Date - Jan 04 , 2024 | 03:23 PM