Viral Video: వరదల్లో చిక్కుకుని పర్యాటకుల నరకయాతన.. గగుర్పొడిచే వీడియో
ABN, Publish Date - Jul 08 , 2024 | 05:09 PM
మహారాష్ట్రని భారీ వర్షాలు(Heavy Rains) వణికిస్తున్నాయి. ఇప్పటికే ముంబయి మహా నగర ప్రజలు వరదలతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటుండగా.. విద్యా సంస్థలకు అక్కడి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. సమస్యా్త్మక ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు మోహరించాయి.
ముంబయి: మహారాష్ట్రని భారీ వర్షాలు(Heavy Rains) వణికిస్తున్నాయి. ఇప్పటికే ముంబయి మహా నగర ప్రజలు వరదలతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటుండగా.. విద్యా సంస్థలకు అక్కడి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. సమస్యా్త్మక ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు మోహరించాయి.
అయితే మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాకి చెందిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. పర్యాటక ప్రాంతానికి వెళ్లి ఎంజాయ్ చేద్దామనుకున్న టూరిస్టులు వరదల్లో చిక్కుకున్నారు. అప్పట్లో మరాఠా సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ రాయగడ్ కోటకు ఏటా లక్షల సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు.
ఈ క్రమంలో పర్యాటనకు వచ్చిన టూరిస్టులకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లే పరిస్థితి ఏర్పడింది. అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో రాయ్ ఘడ్ కోటపై నుంచి మెట్ల మార్గాన వరద నీరు రాసాగింది. ఎంతకూ వర్షం తగ్గకపోవడంతో మెట్లపై భారీ వరద ఏర్పడింది. దీంతో పర్యాటకులు పక్కనే ఉన్న ఇనుప రేయిలింగ్ పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నారు.
అక్కడ చిక్కుకున్న పర్యాటకులను రోప్ వే ద్వారా సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా రాయ్‌గడ్ కోటకు వెళ్లే చిత్త దర్వాజా, నానే దర్వాజా వద్ద ప్రవేశ ద్వారాన్ని బారికేడ్లతో మూసేశారు. ఆ ప్రాంతంలో పోలీసు బలగాలు మోహరించారు.
జనజీవనం అస్తవ్యస్తం..
ఆదివారం నుంచి రాయ్‌ఘడ్ సహా మహారాష్ట్రలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబయిలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వరదలతో పదుల సంఖ్యలో రైళ్లు రద్దు అయ్యాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.
For Latest News and National News click here
Updated Date - Jul 08 , 2024 | 05:09 PM