ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amit shah on Ambedkar Remarks: మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్లు బాహాబాహీ

ABN, Publish Date - Dec 24 , 2024 | 04:13 PM

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వ్యవహారం కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది.

చండీగఢ్: పార్లమెంటు వెలుపల ఇటీవల అధికార బీజేపీ, విపక్ష ఎంపీల మధ్య బాహాబాహీకి దిగిన సంఘటన ఇంకా సద్దుమణగక ముందే చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ (Chandigarh Municipal body) సమావేశంలో ఇదే తరహా ఘటన పునరావృతమైంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వ్యవహారం కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. దీంతో ఇరువర్గాల వారు ఆగ్రహంతో ఒకరినొకరు నెట్టుకుంటూ కలబడ్డారు. ఈ వ్యవహారం మొత్తం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.

Rahul Gandhi: వెల్లుల్లి కంటే బంగారం ధరే చౌక.. కూరగాయల మార్కెట్లో రాహుల్


రాజ్యసభలో గతవారం రాజ్యాంగంపై జరిగిన చర్చల్లో అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు గాను అమిత్‌షా రాజానామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, ఆప్ ఒక తీర్మానాన్ని మున్సిపల్ సమావేశంలో ఆమోదించాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు ఉంది. ఈ రెండు పార్టీలు చేసిన తీర్మానంపై బీజేపీ కౌన్సిలర్లు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపైకి దూసుకువచ్చారు. ఉభయవర్గాలు ఒకరినొకరు నెట్టుకోవడంతో సభలో గందరగోళం నెలకొంది. తమ చర్యలు సీసీటీవీలో రికార్డవుతాయని తెలిసినా కొందరు కౌన్సిలర్లు ఏమాత్రం వెనక్కితగ్గకపోవడం కనిపించింది. అంబేద్కర్ పట్ల అమిత్‌షా అగౌరవంగా ప్రవర్తించారని విపక్ష పార్టీ కౌన్సిలర్లు ఆరోపించగా, బీజేజీ నేతలు ఆ వ్యాఖ్యలతో విభేదించారు.


కాగా, అంబేడ్కర్‌పై అమిత్‌షా వ్యాఖ్యలపై పార్లమెంటు వెలుపల కాంగ్రెస్ ఇటీవల పలు రీతిల్లో నిరసనలు తెలిపింది. ఈ క్రమంలోనే అధికార, విపక్ష పార్టీ ఎంపీల మధ్య బాహాబాహీ చోటుచేసుకోవడంతో ఇద్దరు బీజేపీ ఎంపీలు గాయపడ్డారు. తమ నేత మల్లికార్జున్ ఖర్గేను కూడా నెట్టేశారంటూ కాంగ్రెస్ ఆరోపించారు. దీనిపై రెండు పార్టీలు పార్లమెంటు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు నమోదు చేశాయి.


ఇది కూడా చదవండి..

NDA government : గత ఏడాదిన్నరలో..10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం

Chennai: దిండివనం వద్ద పట్టాలపై పగుళ్లు

Delhi Assembly Elctions: సీఎంపై పోటీకి దిగుతున్నదెవరంటే..

For National News And Telugu News

Updated Date - Dec 24 , 2024 | 04:20 PM