వాయుసేన- ఉబెర్ ఒప్పందంపై నిపుణుల అభ్యంతరాలు
ABN, Publish Date - Nov 04 , 2024 | 03:22 AM
భారత వాయుసేన, అమెరికాకు చెందిన రైడ్ షేరింగ్ యాప్ ‘ఉబెర్’ మధ్య ఇటీవల జరిగిన అవగాహన ఒప్పందంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
న్యూఢిల్లీ, నవంబరు 3 : భారత వాయుసేన, అమెరికాకు చెందిన రైడ్ షేరింగ్ యాప్ ‘ఉబెర్’ మధ్య ఇటీవల జరిగిన అవగాహన ఒప్పందంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఒప్పందంతో వాయుసేన సమాచార గోప్యతకు, వాయుసేన సిబ్బంది రక్షణకు ముప్పు పొంచి ఉందని వాయు సేన మాజీ ఉద్యోగులు, భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఒప్పందం ప్రకారం వాయుసేన ప్రస్తుత, మాజీ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యుల రవాణా అవసరాలకు అనుగుణంగా ఉబెర్ ఓ ప్రత్యేక అప్లికేషన్‌ను వాయుసేనకు ఇవ్వనుందని సమాచారం. ఉబెర్ సేవలు వినియోగించుకోవడం వల్ల వాయుసేనకు సంబంధించిన కీలక సమాచారం, లొకేషన్లు, ఉద్యోగుల వివరాలు బయటి వ్యక్తులకు బహిర్గతం అవుతాయని వాయుసేన మాజీ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.
Updated Date - Nov 04 , 2024 | 03:22 AM