Share News

Sikkim Assembly Elections: సిక్కింలో ఎస్‌కేఎం విజయభేరి, రెండీ సీట్లలోనూ నెగ్గిన సీఎం ప్రేమ్‌ సింగ్

ABN , Publish Date - Jun 02 , 2024 | 05:05 PM

సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఏకపక్షమైంది. ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ సారథ్యంలోని సిక్కిం క్రాంతికారి మోర్చా వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. 32 అసెంబ్లీ స్థానాల్లో 31 స్థానాలను ఎస్‌కేఎం గెలుచుకుని సంపూర్ణ ఆధిపత్యాన్ని సాధించింది.

Sikkim Assembly Elections: సిక్కింలో ఎస్‌కేఎం విజయభేరి, రెండీ సీట్లలోనూ నెగ్గిన సీఎం ప్రేమ్‌ సింగ్

గ్యాంగ్‌టక్: సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో (Sikkim Aseembly Elections) విజయం ఏకపక్షమైంది. ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ (Prem Singh Tamang) సారథ్యంలోని సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM) వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. 32 అసెంబ్లీ స్థానాల్లో 31 స్థానాలను ఎస్‌కేఎం గెలుచుకుని సంపూర్ణ ఆధిపత్యాన్ని సాధించింది. సిక్కిం డొమోక్రాటిక్ ఫ్రంట్ (SDF) కేవలం ఒకే సీటుతో కుదేలయింది. 2019 వరకూ 25 ఏళ్ల పాటు రాష్ట్రంలో సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ అధికారంలో ఉంది. ఆసక్తికరంగా ఎస్‌డీఎఫ్ సుప్రీం, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పోక్లోక్ కామ్రాంగ్, నామ్‌చేబంగ్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా, రెండు స్థానాల్లోనూ ఆయన ఎస్‌కేఎం అభ్యర్థుల చేతిలో ఓటమిని చవిచూశారు. ఏప్రిల్ 19న తొలివిడతలో సిక్కింగ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ఆదివారం ఉదయం 6 గంటలకు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ మొదలైంది.

Sikkim: ఎస్‌కేఎం అభ్యర్థి చేతిలో ఓటమిపాలైన మాజీ సీఎం..


రెండు సీట్లలోనూ గెలిచిన తమాంగ్

ముఖ్యమంత్రి తమాంగ్ ఈసారి రెనాక్, సోరెంగ్ చాకుంగ్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండు స్థానాల్లోనూ గెలుపొందారు. రెనాక్‌లో ఎస్‌డీఎఫ్ అభ్యర్థి సోమ్‌నాథ్‌పై 7,044 ఓట్ల అధిక్యంతో తమాంగ్ గెలిచారు.

For Latest News and National News click here..

Updated Date - Jun 02 , 2024 | 05:05 PM